Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

కొండా సురేఖ ఔట్.. ముగ్గురిని వరించిన పదవులు..!

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో ఒకరిని మించిన ఒకరు రాజకీయాలు చేస్తున్నారు. ఏకంగా మంత్రి కొండ సురేఖ ను భర్తరఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

కొండా సురేఖ ఔట్.. ముగ్గురిని వరించిన పదవులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో ఒకరిని మించిన ఒకరు రాజకీయాలు చేస్తున్నారు. ఏకంగా మంత్రి కొండ సురేఖ ను భర్తరఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మంత్రి కొండ సురేఖను భర్తరఫ్ చేయాలని ఆ పార్టీ అధిష్టానం గవర్నర్ కు లేఖ పంపింది. ఇది ఇలా ఉండగా కొండ సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందడంతో ఆ వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ముగ్గురికి పదవులు వరించాయి.

మంత్రి శ్రీమతి కొండా సురేఖను తక్షణమే మంత్రివర్గం నుండి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఒక సిఫార్సును గవర్నర్ కి ఇప్పటికే పంపడం జరిగింది. అదేవిదంగా తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

డాక్టర్ జి. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించారు.అదేవిదంగా ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నీరెల్లా శారద నియామకాన్ని కూడా ఆమోదించారు. మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధా రాణిని కాకతీయ పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (KUDA) ఛైర్‌పర్సన్‌గా నియమించడానికి సి ఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు.

MOST VIEWS 

మరిన్ని వార్తలు