Suryapet : వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొప్పుల వేణారెడ్డి..!
Suryapet : వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొప్పుల వేణారెడ్డి..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డిని నియమిస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్రవ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖ డైరెక్టర్ ఎం రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
వైస్ చైర్మన్ గా గట్టు శ్రీనివాస్, డైరెక్టర్లుగా ధరావత్ వీరన్న నాయక్, దాసరి తిరుమలరావు, నకిరేకంటి బాలకృష్ణ, పచ్చిపాల వెంకన్న, గోపగాని పెద వెంకన్న, మేడిమెలపు దామోధర్ రెడ్డి, ఆర్తి కేశవులు, గోగుల పద్మ, చిన్నోజు నర్సింహా చారి,షేక్ అబ్దుల్ కరీం, వుప్పల సత్యనారాయణ, మాడుగుల నవీన్ కుమార్ లతో పాటు అనంతారం పిఎసిఎస్ చైర్మెన్,
జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్, వ్యవసాయ సహాయ డైరెక్టర్, మునిసిపాలిటీ ప్రత్యేక అధికార్లు సభ్యులుగా కొనసాగనున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నూతనంగా నియామకమైన కొప్పుల వేనారెడ్డి తోపాటు కమిటీ సభ్యులను పూలమాలలు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
-
Job mela : మార్చి 12న జాబ్ మేళా నిర్వాహణ..!
-
Fake Doctor : నకిలీ వైద్యుడి గుట్టు రట్టు.. క్లినిక్ సీజ్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!









