Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nagarjunasagar : కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తి నీటి విడుదల, పర్యాటకుల సందడి..! 

Nagarjunasagar : కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తి నీటి విడుదల, పర్యాటకుల సందడి..! 

నాగార్జునసాగర్, మన సాక్షి :

కృష్ణమ్మ సాగరం దిశగా పరుగులు పెడుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతూ ఉంది. దీంతో నాగార్జున సాగర్ నుంచి దిగువన ఉన్న అన్ని ప్రాజెక్టుల బంధనాలు తెంచుకుని సాగరంలో కలిసేందుకు పోటెత్తుతూ ప్రవహిస్తోంది.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో నాగార్జునసాగర్ కు పెద్ద స్థాయిలో వరద వచ్చిచేరు తోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు వదులుతున్నారు. 20 గేట్లు 5 అడుగులు మేర పైకి ఎత్తి క్రస్ట్ గేట్ల ద్వారా 161380 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.

దీంతో సాగర్ ప్రాంతంలో అపూ రూప దృశ్యం కనులవిందు చేస్తోంది. ప్రస్తుతం సాగర్ కు ఇన్లో 189123 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 20గేట్ల ద్వారా 161380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులు. ఉంది ఇన్ ఫ్లో 189123 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 202956 క్యూసెక్కులు ఎగువ నుంచి వరద ప్రవాహంలో హెచ్చు తగ్గులను బట్టి నీటి పారుదల శాఖ అధికారులు సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తడం, లేదా దించడం చేస్తున్నారు. సాగర్ గేట్లు ఎత్తడంతో ఆదివారం సెలవు కావడం వల్ల పర్యాటకుల సందడి పెరిగింది.

MOST READ : 

మరిన్ని వార్తలు