దరఖాస్తులకు చివరి రోజులే కీలకం.. బిఎల్ఆర్..!

ప్రజాపాలన దరఖాస్తులకు చివరి రెండు రోజులే కీలకమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ అర్) అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

దరఖాస్తులకు చివరి రోజులే కీలకం.. బిఎల్ఆర్..!

మిర్యాలగూడ, మనసాక్షి :

ప్రజాపాలన దరఖాస్తులకు చివరి రెండు రోజులే కీలకమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ అర్) అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చివరి రెండు రోజుల్లో నిర్వహించబోయే ప్రజా పాలన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ రెండు రోజులు కీలకమైన రోజులని ఆయన పేర్కొన్నారు.

ALSO READ : BREAKING : కెసిఆర్ ను కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం..!

దరఖాస్తుల సంఖ్య పెంచాలని, ప్రతి ఒక్కరి దగ్గర దరఖాస్తులు తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. దరఖాస్తు ఫారాలు అందక ప్రజలు జిరాక్స్ లు తీసుకుంటున్నారని, ప్రతి ఒక్కరికి దరఖాస్తు ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అదేవిధంగా జనవరి ఆరవ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుల స్వీకరిస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా అధికారులు చొరవ చూపాలని కోరారు.

ALSO READ : కాంగ్రెస్ లో చేరిన షర్మిల.. వైఎస్ఆర్ టిపి విలీనం..!