Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

లిఫ్టు నిర్మాణం ఆపాలని రైతుల ఆందోళన

లిఫ్టు నిర్మాణం ఆపాలని రైతుల ఆందోళన

మేళ్లచెరువు, మనసాక్షి:

చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద మెగా లిఫ్టు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ మేళ్లచెరువు మండల కేంద్రంలో శనివారం కొందరు రైతులు ఆందోళనకు దిగారు.కొత్త లిఫ్టు వలన తమ భూములు కోల్పోతున్నామని,ఉన్న లిఫ్టుల ద్వారానే నీళ్లను అందించాలంటూ మేళ్లచెరువు మెయిన్ రోడ్ పై ధర్నా చేశారు.

 

అనంతరం తహసీల్దార్ దామోదర్ రావుకు వినతిపత్రం అందజేశారు.రైతులు మాట్లాడుతూ లిఫ్టు నిర్మాణం నిలిపివేయాలని అనేకసార్లు ఆందోళన చేసినా అధికారులు స్పందించడం లేదని అన్నారు.ఒక్క ఎకరా భూమిని కూడా ఇవ్వమని అన్నారు.

 

కార్యక్రమంలో వర్ర వెంకటరెడ్డి, కాకునూరి వెంకటరెడ్డి, పందిళ్లపల్లిశ్రీనివాసరెడ్డి, ముడెం నవీన్ రెడ్డి,బెద్దూరు ఉపేందర్ రెడ్డి, పసుపులేటి కోటేశ్వర్ రావు,పసుపులేటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు