Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజాతీయం

Liquor Scam : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ కార్యకర్తల ఆందోళన..!

Liquor Scam : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ కార్యకర్తల ఆందోళన..!

మన సాక్షి : వెబ్ డెస్క్

లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి అరెస్టు చేసింది. ఆయన నివాసంలో రెండు గంటల పాటు విచారణ జరిపించిన ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నివాసం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి ఆయనను అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

ఇదిలా ఉండగా కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో ఆయన అరెస్టును ఆపలేమంటూ సుప్రీంకోర్టు పేర్కొన్నది . కాగా కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన పిటిషన్ ను న్యాయవాదులు సుప్రీంకోర్టులో వేయగా దాన్ని శుక్రవారం పరిశీలిస్తామని కోర్టు తెలియజేసింది.

కేజ్రీవాల్ కు లిక్కర్ కుంభకోణంలో ఇప్పటివరకు ఏడి అధికారులు 9 పర్యాయాలు నోటీసులు జారీ చేశారు. అయినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అరెస్టు చేయడంతో పాటు ఆయన ఫోన్లు కూడా ఉడీ అధికారులు సీజ్ చేశారు. కేజ్రీవాల్ నివాసం వద్ద ఆపు కార్యకర్తలు భారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ALSO READ : Miryalaguda : కాంగ్రెస్ మంత్రులకు అక్రమ వసూళ్లు, దందాలు తప్ప రైతుల గోడు పట్టట్లేదు..!

మరిన్ని వార్తలు