Miryalaguda : కాంగ్రెస్ మంత్రులకు అక్రమ వసూళ్లు, దందాలు తప్ప రైతుల గోడు పట్టట్లేదు..!

కాంగ్రెస్ మంత్రులకు రాజకీయాలు, అక్రమ వసూళ్లు, దండాలు తప్ప రైతుల గోడు పట్టట్లేదని మాజీ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

Miryalaguda : కాంగ్రెస్ మంత్రులకు అక్రమ వసూళ్లు, దందాలు తప్ప రైతుల గోడు పట్టట్లేదు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కాంగ్రెస్ మంత్రులకు రాజకీయాలు, అక్రమ వసూళ్లు, దండాలు తప్ప రైతుల గోడు పట్టట్లేదని మాజీ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మిర్యాలగూడ మండలం యాదగిరి పల్లి లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి తో కలిసి ఎండిన వరి పొలాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అన్నదాతలతో ముచ్చటించి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ నీరు అందించే అవకాశం ఉన్న ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చి రైతులకి అందించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ లో ఏ గ్రామానికి వెళ్ళిన ఎండిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, పెట్టుబడులన్నీ మట్టిలో కలిసిపోయి రైతులు విలపిస్తున్నారని అన్నారు. ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే ,అధికారులు కూడా రైతుల వంక కన్నెత్తి చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ లు ఉత్తరకుమారులని, ప్రగల్భాలు పలకడం తప్ప దేనికి పనికిరారని అన్నారు.

వారుకి ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్ప రైతుల సంక్షేమం పట్టలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పూరిత వైఖరితో రైతులు మరింత అగాధంలోకి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరువుపై సర్వే చేయించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం అవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు చింతారెడ్డి శ్రీనివాస రెడ్డి, మోషీన్ అలీ, బీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, కంచర్ల కృష్ణా రెడ్డి, మాజీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, నాయకులు, చౌగాని బిక్షం గౌడ్, కట్టా మల్లేష్ గౌడ్, హాతీరాం నాయక్, వీరకోటి రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాములు గౌడ్,సాయన్న, కుర్ర శ్రీను, రవి, వెంకటేశ్వర్లు, షోయబ్, రమణ,శివ, బచ్చలకురి శ్రీను,యాదగిరి, బిక్షా నాయక్, లింగయ్య, ఛీన్యా నాయక్, దుండిగాల శ్రీనివాస్, వీరయ్య, జానపాటి శ్రీను, కోటి రెడ్డి, గౌరు శ్రీనివాస్, యర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

Telangana : మీ కరెంట్ బిల్లు జీరో రాలేదా..? అయితే ఇలా చేయండి..!

BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!

Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!

మిర్యాలగూడ : కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్ల విక్రయం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..!