లిటిల్ ఫ్లవర్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ .. భారీ స్పందన..!

మిర్యాలగూడ పట్టణంలో హౌజింగ్ బోర్డు లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆవరణలో శుక్రవారం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే పేరుతో శాస్త్ర విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. 5 వ తరగతి లోపు బాల బాలికలు వివిధ రకాల నమూనాలతో ప్రదర్శన ను నిర్వహించారు.

లిటిల్ ఫ్లవర్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ .. భారీ స్పందన..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలో హౌజింగ్ బోర్డు లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆవరణలో శుక్రవారం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే పేరుతో శాస్త్ర విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. 5 వ తరగతి లోపు బాల బాలికలు వివిధ రకాల నమూనాలతో ప్రదర్శన ను నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మిర్యాలగూడ మండల విద్యాధికారి ఎం. బాలాజీ నాయక్ ప్రదర్శన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వివిధ విషయాల పట్ల ఎంతో వ్యయ ప్రయాసల తో తయారు చేసిన వివిధ నమూనాలను తిలకించి విద్యార్థుల అద్భుత పని తీరును, వారిని ప్రోత్సాహించిన ఉపాధ్యాయులను అభినందించారు.

ఇటువంటి విజ్ఞాన దాయకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని కూడ అభినందించారు. పిల్లలు వివిధ శాస్త్ర, సాంఘిక, గణిత, ప్రకృతి , ఇతర సాంకేతిక విషయాల పట్ల ఆకట్టుకునే రీతిలో రూపాలను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

ALSO READ: BREAKING : కెసిఆర్ కు తీవ్ర అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చికిత్స..!

ఈ కార్య క్రమానికి ట్రాస్మా జిల్లా కార్యదర్శి గాదె రవీందర్ రెడ్డి హాజరై పిల్లల లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి నందుకు అందరిని అభినందించారు.

అలాగే స్థానిక చౌదరి కాలనీ లోని ఆదిత్య హై స్కూల్ కరెస్పాండెంట్ మారుతి అమరేందర్ రెడ్డి అతిధి గా పాల్గొని వివిధ రకాల బోధన ఉపకరణాలతో పిల్లలు ప్రదర్శించిన ప్రదర్శనలను చూసి పిల్లల తెలివితేటలను మెచ్చుకున్నారు.

ALSO READ : కూలిన ప్రగతి భవన్ గేట్లు.. తొలగించిన ముళ్ళ కంచె..!

ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ కె. కె. జయరాజన్, వైస్ ప్రిన్సిపాల్ జిన్సీ జయరాజన్, భోధనా సిబ్బంది వినీష్ కుమార్, మధు నాయర్, శంకర్ బాబు, రమేష్ కుమార్ వినోద్ చంద్రన్, పద్మ, పద్మావతి, జ్యోతి, సరిత, మమత, ఇతర సిబ్బంది నాగు నాయక్ తో పాటు పిల్లల తల్లి దండ్రులు అధిక సంఖ్య లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ALSO READ : ఆరు గ్యారెంటీలపై రేవంత్ తొలి సంతకం.. మాట నిలుపుకొని దివ్యాంగురాలుకు ఉద్యోగం..!