సూర్యాపేట : అనాదలను మోసం చేసిన ఘనుడు కె సి ఆర్ –  మంద కృష్ణ మాదిగ

సూర్యాపేట : అనాదలను మోసం చేసిన ఘనుడు కె సి ఆర్ –  మంద కృష్ణ మాదిగ

సూర్యాపేట , మనసాక్షి

అనాధలకు అన్ని తానైతానని ఆఖరికి అనాధల్ని మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని అతనికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం మున్సిపాలిటీ వద్ద మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ఇంచార్జ్ యాతాకుల రాజన్న మాదిగ ఆధ్వర్యంలో అనాధల అరిగోస దీక్ష నిర్వహించడం జరిగింది .

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానవత ఉద్యమాల మహా జననేత మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో అనాధ పిల్లలను ఆదుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇచ్చి నేటికీ ఎనిమిది సంవత్సరాల ఎనిమిది రోజులు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మహాజన సోషలిస్టు పార్టీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అనాధల అరిగోస కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.

 

తెలంగాణ రాష్ట్రంలో అమ్మా నాన్న లు లేని అనాధలకు అన్ని కెసిఆర్ అవుతానని వారికి స్మార్ట్ కార్డులు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య వైద్యం గురుకుల పాఠశాలలు నాలుగు నుంచి ఐదు వేల పెన్షన్, ఇలా హామీలు ఇచ్చి ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాలను మోసం చేస్తున్నట్లుగానే ఆఖరికి అనాధలను కూడా మోసం చేసిన నీచమైన చరిత్ర కేసీఆర్ ది అని అన్నారు.

 

ALSO READ : 

1. Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు

2. Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!

3. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

4. Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్..!

5. Rythu Bandhu scheme : రైతుబంధుపై కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్…!

 

టిఆర్ఎస్, బిఆర్ఎస్ గా ఎందుకు మారిందోనని తెలంగాణలో అనాధలను ఆదుకోలేని బిఆర్ఎస్ బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారు అని ఆవేదన వ్యక్తంచేశారు., ఇలా అనేక మోసాలు చేస్తూ ఆఖరికి అనాధలను కూడా మోసం చేశారని ఎద్దేవా చేశారు.

 

ఇప్పటికీ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు దఫాలుగా అనాధల కోసం ఉద్యమం కొనసాగుతుందని అనాధలకు అండగా ప్రభుత్వము ప్రతిపక్షాలు నిలబడేంతవరకు మా ఉద్యమం కొనసాగుతుందని మానవీయ కోణంలో జరిగే ఈ మానవతా ఉద్యమానికి సమాజమంతా మద్దతు గా ఉండాలని కోరారు.

 

అనాధలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కేసిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దీక్ష కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు ఎర్ర వీరస్వామి కనుకుంట్ల వెంకన్న, పుట్టల మల్లేష్ పెడమర్తి నాగేశ్వరి, గార కనకయ్య, బొడ్డు విజయ్ కుమార్ ,బొజ్జ వెంకన్న, మామిడి కరుణాకర్, బత్తుల వెంకట రాములు, తాటిపాముల నవీన్, చెరుకుపల్లి సతీష్,

 

గోపి, దాసరి వెంకన్న చింతలచెరువు శంకర్, మిరియాల చిన్ని పాల్వాయి వెంకటేష్, అనాధ పిల్లలు భూమి, స్రవంతి, అనిత నాగరాజు, హరీష్, కవిత, నాగచైతన్య, శ్రీదేవి శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు