Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణమెదక్

Assign Land : ప్రభుత్వ అసైన్డ్ భూమిలో వైన్స్ ఏర్పాటు పై అదనపు కలెక్టర్ సీరియస్..!

Assign Land : ప్రభుత్వ అసైన్డ్ భూమిలో వైన్స్ ఏర్పాటు పై అదనపు కలెక్టర్ సీరియస్..!

మెదక్ జిల్లా కొల్చారం తాసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్.. వెంకటేశ్వర్లు

కొల్చారం, మన సాక్షి :

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించే బాధ్యత తాసిల్దార్లేదేనని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కుల్చారం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం ఈ నెల ఒకటి నుండి 17వ తేదీ లోగా ధరణిలో వచ్చిన భూ సమస్యల ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోనీ వివిధ మండలాలలో జరుగుతున్న పెండింగ్ సమస్యలపై పరిష్కారం ఫైళ్లను పరిష్కరించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కొల్చారం మండలంలో వివిధ అధికారుల స్థాయిలో మొత్తం 241 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. కొల్చారం తహసిల్దార్ పరిధిలో 29 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా శుక్రవారం నాటికి 9 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం కావడం పట్ల అదనపు కలెక్టర్ తాసిల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలోగా దరఖాస్తులన్నీ పరిష్కరించాలని తాసిల్దార్ గఫర్ మియా ను ఆదేశించారు.

అసైన్డ్ భూముల క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవాలి ఆదేశం:
కొల్చారం మండలం దుంపలకుంట చౌరస్తా లో ప్రభుత్వ అసైన్ భూములలో ఇల్లు నిర్మిస్తున్న ఆక్రమణదారులకు వెంటనే నోటీసులు అందజేసి కఠిన చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ గఫర్ మియాను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు . పంటల సాగు కోసం ప్రభుత్వం నిరుపేద రైతులకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతమైతే సంబంధిత రైతులకు నోటీసులు అందజేసి తిరిగి ప్రభుత్వంకు సాధీనం చేసే బాధ్యత తాసిల్దారుల దేనిని అజ్ఞాత కలెక్టర్ ఆదేశించారు.

వెంటనే మండలంలోని దుంపలకుంట చౌరస్తా ఏడుపాయల టీ జంక్షన్ వద్ద అన్యాక్రాంతం మైన ప్రభుత్వ భూముల యజమానులకు నోటీసులు అందజేసి తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ అసైన్ భూమిలో వైన్స్ ఏర్పాటు పై ఆగ్రహం:

కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని సర్వేనెంబర్ 254 లో ప్రభుత్వ భూమిలో వైన్స్ ఏర్పాటు చేయడం పై అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే వైన్స్ యజమాన్యానికి ,ప్రభుత్వం అసైన్ చేసిన భూమి యజమానికి నోటీసులు అందజేసి భూమిని ప్రభుత్వ స్వాధీనం చేయాలని అదనపు కలెక్టర్ తాసిల్దార్ ను ఆదేశించారు.

రంగంపేటలో సర్వే నంబర్ 231 లో కాస్ట్ లో లేకున్నా పట్టా పాస్ బుక్ పొందిన రైతు పేరును పహానిలలో నుండి తొలగించాలని ఆదేశించారు. కొల్చారం మండలం చిన్నగనాపూర్ ఐబి సమీపంలో గతంలో ప్రభుత్వం ఆర్టీసీకి అప్పగించిన ప్రభుత్వ భూమి అన్యకాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నాగవర్ధన్ ఆర్ ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు