Medaram : మేడారం హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం..!

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు నేటి నుంచి కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన జాత‌రకు సంబంధించి భ‌క్తులు మొక్కులు చెల్లించుకొని కానుక‌ల‌ను స‌మ‌ర్పించారు

Medaram : మేడారం హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం..!

ములుగు, మన సాక్షి ప్రతినిధి :

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు నేటి నుంచి కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన జాత‌రకు సంబంధించి భ‌క్తులు మొక్కులు చెల్లించుకొని కానుక‌ల‌ను స‌మ‌ర్పించారు.

హుండీ లెక్కింపుల్లో న‌కిలీ క‌రెన్సీ నోట్లు రావడం క‌ల‌క‌లం రేపింది. విచిత్ర‌మేమిటంటే న‌కిలీ క‌రెన్సీ పై అంబేద్క‌ర్ చిత్రం ఉండ‌డం గ‌మ‌నార్హం.

మేడారం జాతర హుండీల్లో నకిలీ వంద రూపాయల నోట్లు దర్శనమిచ్చాయి. హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న మేడారం జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపులో భాగంగా గురువారం మధ్యాహ్నం వరకు తెరిచిన హుండీ లలో అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల కనిపించాయి.

నకిలీ నోట్లను హుండిలలో వేసిన పలువురు భక్తులు నకిలీ కరెన్సీ వెనక అంబేద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్ చేయడం గమనార్హం . ఇంకా ఎన్ని హుండీలలో ఇలాంటి కరెన్సీ ఉందో వేచి చూడాలి.

ALSO READ: BIG BREAKING : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!