మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అదనపు కలెక్టర్ గా విజయేందర్రెడ్డి బాధ్యతల స్వీకరణ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అదనపు కలెక్టర్ గా విజయేందర్రెడ్డి బాధ్యతల స్వీకరణ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మనసాక్షి

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్, రెవెన్యూ గా విజయేందర్రెడ్డి బాధ్యతల చేపట్టారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్, రెవెన్యూగా విజయేందర్రెడ్డి జిల్లా కలెక్టరేట్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

 

జిల్లా అదనపు కలెక్టర్, రెవెన్యూగా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన నర్సింహారెడ్డి బదిలీ కాగా ఆయన స్థానంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో గజ్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓగా విధులు నిర్వహించిన విజయేందర్రెడ్డి కి పదోన్నతి కల్పిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్,రెవెన్యూగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

ALSO READ : 

1. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

2. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

3. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

 

ఈ మేరకు బుధవారం జిల్లా అదనపు కలెక్టర్గా విజయేందర్రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి చంద్రావతి, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.