మేమెంతో మాకంత అన్న వారి పై.. అసెంబ్లీలో సీఎం రేవంత్ (వీడియో)

మేమెంతో మాకంత అన్న బలహీనవర్గాల వాదనతో గొంతు కలిపి… ఆ దిశగా నిర్ణయం చేయడానికి మాకు దిశానిర్ధేశం చేసిన రాహుల్ గాంధీకి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మేమెంతో మాకంత అన్న వారి పై.. అసెంబ్లీలో సీఎం రేవంత్ (వీడియో)

హైదరాబాద్ , మన సాక్షి :

మేమెంతో మాకంత అన్న బలహీనవర్గాల వాదనతో గొంతు కలిపి… ఆ దిశగా నిర్ణయం చేయడానికి మాకు దిశానిర్ధేశం చేసిన రాహుల్ గాంధీకి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కొన్ని నిర్ణయాలు సమాజ గతిని సమూలంగా మార్చుతాయి. తరతరాల అన్యాయానికి చరమగీతం పాడుతాయి. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్క తేల్చాలన్న ప్రజా ప్రభుత్వ నిర్ణయం అటువంటిదే.

ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడిన తరగతులకు సమన్యాయం, సామాజిక న్యాయం దక్కడానికి ఈ కుల జన గణన తిరుగులేని అస్త్రం అవుతుంది.

‘మేమెంతో మాకంత’ అన్న బలహీనవర్గాల వాదనతో గొంతు కలిపి… ఆ దిశగా నిర్ణయం చేయడానికి మాకు దిశానిర్ధేశం చేసిన రాహుల్ గాంధీకి హృదయపూర్వక ధన్యవాదాలు.