అక్రమార్కుల నార తీయడానికి మంత్రి కి కత్తి దొరకడం లేదా..?
అక్రమార్కుల నార తీయడానికి మంత్రి కి కత్తి దొరకడం లేదా..?
అవినీతి పరులను అక్కున చేర్చుకుంది మీరు కాదా..?
టి జె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిధర్మార్జున్
సూర్యాపేట , మనసాక్షి :
అక్రమార్కుల నార తీస్తానని ప్రగల్భాలు పలుకుతున్న మంత్రి గారికి కత్తి దొరకలేదా అని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇంఛార్జ్ కుంట్ల ధర్మార్జున్ అని ప్రశ్నించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత దశాబ్దాకాలం ఆ బడి నుండి వచ్చిన అక్రమార్కులను చుట్టూ రక్షణ వలయం గా పెట్టుకొని వాళ్ళని మూల స్తంభాలుగా చేసుకొని సూర్యాపేటలో అవినీతి పాలన కొనసాగిస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు .
తెలంగాణ ఉద్యమకారులం అందరం కలిసి నిన్ను గెలిపిస్తే చీమల పుట్టలో పాములు జొరబడ్డట్టు ఇక్కడ ఉద్యమం నిర్మించిన వారందరినీ పక్కకు నెట్టి నువ్వు ఆ అక్రమార్కులను నీ అక్కున చేర్చుకున్న ది వాస్తవం కాదా అని నిలదీశారు. సూర్యాపేటకు ఒక శాస్త్రీయమైన అభివృద్ధి స్వేచ్ఛ ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పిద్దామని ప్రయత్నం చేసిన వారందరినీ దూరం నెట్టి, కాకి దయాకర్ చివ్వెంల డేవిడ్,కట్కురి గన్నారెడ్డి లాంటి వారందరినీ క్షోభకు గురి చేసింది వాస్తవం కాదా అని అన్నారు.
ALSO READ :
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
- Congress : కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు : టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు
మంత్రి కి నిజాయితీ ఉంటే కుడ కుడ గుట్టల చుట్టూ తరిగిపోయిన భూమిని అన్యాక్రాంతానికి లోనైనటువంటి సర్కారు భూమిని స్వాధీనం చేసి ప్రజలకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. కుడ కుడ గుట్టల చుట్టూ శ్మశాన వాటిక ను సైతం రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి అమ్ము కోవడమే కాకుండా ఎస్వీ కాలేజీ పక్కన ఉన్నటువంటి సూర్యాపేట వైశ్యుల భూమిని ఖబ్జా చేయడానికి ప్రయత్నించి నీ శిబిరంలో చేరిన ఆ నాయకుని ఆగడాలపై విచారణ చేపిస్తారా అని అన్నారు.
చివ్వెంల మండలంలో సూర్యాపేట మండలంలో జరుగుతున్న భూ దందాలకు మంత్రి అనుచరులే ప్రధాన కారణం అని ధర్మార్జున్ విమర్శించారు. దందాల అధికార పోటీలో తనకు ఎదురొచ్చిన వారిని తప్పించే ప్రయత్నంలో తనకు తానే సత్యహరిచంద్రులుగా కితాబులిచ్చుకుంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వీరి అసలు స్వరూపాలను నియోజకవర్గ ప్రజల ముందు పెట్టి సూర్యాపేటలో స్వేచ్ఛాయిత రాజకీయ, వ్యాపార వాతావరణానికి తెలంగాణ జన సమితి కృషి చేస్తుందని అన్నారు . తనను విభేదిస్తే పోలీస్ కేసులు పెట్టడం సరి కాదు అన్నారు.
MOST READ :
- Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
- Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
- Suryapet : సూర్యాపేటలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.. పోటా పోటీగా ధర్నాలు..!
- NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
- Suryapet : వట్టే జానయ్య ప్రధాన అనుచరుడు పిల్లలమర్రి ఉపేందర్ అరెస్ట్, రిమాండ్..!
రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల ప్రయోజనాల కోసమే అయినా దళితుల కోసం ప్రకటించిన దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి అని ధర్మార్జున్ కోరారు దళిత బంధువులు ఆశయం చూపించి ఇతర పార్టీలలో ఉన్న నాయకులను కార్యకర్తలను ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి అనైతిక చర్యలను మానుకొని వాస్తవ అవసరాలు ఉన్నవారికి దళిత బందును అందే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలోరాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమా శంకర్ , జిల్లా అధ్యక్షుడు మాండ్ర మల్లయ్య యాదవ్, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులునారబొయిన కిరణ్ ముదిరాజ్ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ కుంచం చంద్ర కాంత్ కో కన్వీనర్ వీరేశ్ నాయక్ , విద్యార్ధి జనసమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్, చివ్వెంల మండల అధ్యక్షుడు సుమన్ నాయక్, సూర్యాపేట మండల కోఆర్డినేటర్ వల్కి రాజు ఆత్మకూరు మండల కోఆర్డి నే టర్ జాటోతు శ్రీను, పెన్ పహాడ్ మండల బాధ్యులు,పానుగోటి సూర్యనారాయణ , పట్టణ నాయకులు దేవత సతీశ్, రైతు సమితి జిల్లా కార్యదర్శి మల్సూర్, విద్యార్థీ జన సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ సింగ్ మైనార్టీ సెల్ నాయకులు ఉమర్ తదితరులు పాల్గొన్నారు.









