Miryalaguda : మిర్యాలగూడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు..!
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా,, బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అధికారికంగా అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, దళిత సంఘాలతో కలిసి ఘనంగా నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా,, బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అధికారికంగా అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, దళిత సంఘాలతో కలిసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ భవన్ నందు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం అన్ని కుల సంఘాల, రాజకీయ పార్టీల నాయకులతో కలిసి రాజీవ్ చౌక్ నుంచి బస్టాండ్ నందు గల అంబేద్కర్ విగ్రహం వరకు ఘనంగా భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది.
అనంతరం సహా పంక్తి భోజనాలు చేయడం జరిగింది.అనంతరం ఉచిత బ్లెడ్ బ్యాంక్ ప్రారంభించి దాతలు రక్త దానం చేసారు.అనంతరం బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం వేసవి కాలం వరకు కొనసాగుతుందని తెలియజేసారు.
ఈ సందర్భంగా బీ ఎల్ ఆర్ మాట్లాడుతూ నేడు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి అందరితో కలిసి ఇలా ఘనంగా నివాళులు అర్పించడం చాలా గర్వంగా ఉందని అన్నారు.
బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం వల్లే నేడు మనమందరం సమాన హక్కులతో జీవిస్తున్నామని,
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రాజ్యాంగ విలువలను కాపాడటంలో ముందుంటుందన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు.
ఆయన బాటలోనే నడుస్తూ, ప్రజా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది అని అన్నారు.
ఆయన ఆశయ సాధనలో మనమందరం భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. ఇలాగే మన మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా కుల, రాజకీయ పార్టీలకి అతీతంగా అందరం ఐకమత్యం తో భాగస్వాములు అవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, నాయకులు పగిడి రామలింగయ్య, కొమ్ము శ్రీను, సైలాబ్ నాయక్, బెజ్జం సాయి, తలకొప్పుల సైదులు, డాక్టర్ రాజు, తాళ్లపల్లి రవి, ప్రభాకర్, పాల్గొన్నారు.












