మిర్యాలగూడ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి..!

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి షురూ అయింది. ఆ పార్టీ అధిష్టానం వామపక్షాలతో పొత్తు ఉన్నందున సిపిఎం కు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ నేతలు టికెట్టు కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని భారీ ర్యాలీ నిర్వహించారు.

మిర్యాలగూడ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి..!

కాంగ్రెస్ టికెట్ కోసం మొదలైన పోరు

సిపిఎం కు కేటాయిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక

మిర్యాలగూడ , మన సాక్షి:
మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి షురూ అయింది. ఆ పార్టీ అధిష్టానం వామపక్షాలతో పొత్తు ఉన్నందున సిపిఎం కు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ నేతలు టికెట్టు కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని భారీ ర్యాలీ నిర్వహించారు.

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో దామరచర్ల మండలం రాళ్లవాగు తండా వద్ద ఉన్న మాజీ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యనాయక్ స్తూపం నుంచి మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

సేవ్ కాంగ్రెస్ – సేవ్ మిర్యాలగూడ నినాదంతో నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. సిపిఎం కు టికెట్ కేటాయిస్తే ఊరుకునేది లేదని, కాంగ్రెస్ పార్టీకే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు.

ALSO READ : నల్లగొండలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు కౌన్సిలర్లు..!

ఈ సందర్భంగా రాజీవ్ చౌక్ వద్ద నిర్వహించిన సభలో బిఎల్ఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తో ఢీకొనేది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని అధిష్టానం స్థానిక నాయకులను సంప్రదించకుండా సిపిఎం కు కేటాయిస్తామనడం మంచిది కాదన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, అధికార పార్టీ వాళ్లు కాంగ్రెస్ సర్పంచుల గ్రామాలలో అభివృద్ధి కూడా చేయలేదన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కరరావును ఓడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కంకణ బద్ధులై ఉన్నారని, అలాంటి పరిస్థితుల్లో సిపిఎంకు కేటాయిస్తామనడం సరైనది కాదన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ర్యాలీలో పాల్గొన్న భక్తుల లక్ష్మారెడ్డి సోమశిల కింద పడిపోయారు ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు .

ALSO READ : రేవంత్ రెడ్డి అరెస్ట్.. గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..!

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొదిల శ్రీనివాస్, తమ్ముడబోయిన అర్జున్, నూకల వేణుగోపాల్ రెడ్డి, చిలుకూరి బాలు, దేశిడి శేఖర రెడ్డి , బండి యాదగిరి రెడ్డి ,చల్లా అంజిరెడ్డి ,తక్కలపల్లి శ్రీనివాస్ ,కొమ్ము శ్రీనివాస్, బెజ్జం సాయి, సిద్ది నాయక్ తదితరులు పాల్గొన్నారు.