మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే భాస్కరరావు

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు తన శాసశక్తులకు చేస్తానని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు. . బుధవారం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 108 వ జయంతి ను పురస్కరించుకొని ఈరోజు మిర్యాలగూడ పట్టణం సాగర్ రోడ్ నందు గల వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే భాస్కరరావు

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి

మిర్యాలగూడ  , మన సాక్షి :

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు తన శాసశక్తులకు చేస్తానని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అన్నారు. . బుధవారం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 108 వ జయంతి ను పురస్కరించుకొని ఈరోజు మిర్యాలగూడ పట్టణం సాగర్ రోడ్ నందు గల వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చెయ్యాలని అఖిల పక్షాల అద్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని, త్వరలో మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించనున్న బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మున్సిపల్ , ఐ.టి శాఖమాత్యులు కల్వకుంట్ల తారకరామారావు దృష్తికి, ముఖ్యమంత్రి కె.సి.ఆర్ దృష్తికి కూడా తీసుకెల్లి మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

ALSO READ : Suicide : ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన విద్యార్థి ఆత్మహత్య..!

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని తెలంగాణకు ఎనలేని సేవలను అందించారని తొలి దశ మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం వారు పాటుపడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా నాడు తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని వదిలి జలవిహార్ లో ఉన్న తన కార్యాలయాన్ని ఉద్యమం కోసం ఉపయోగించిన మహనీయుడు బాపూజీ అని అన్నారు.

యావత్తు తెలంగాణ సమాజం కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క సేవలను గుర్తు ఉంచుకుంటుందని అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వర్తించడం అభినందనీయం, గర్వకారణం అన్నారు. బాపూజీ యొక్క సేవలను మరింత విస్తృతంగా ప్రచారం చేస్తూ వారిని మరింత గొప్పగా గౌరవించుకోవాలని వారు తెలిపారు.

ALSO READ : మిర్యాలగూడ : ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికపై లైంగిక దాడి..!

కార్యక్రమంలో విద్యుత్ బి.సి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్, నల్లగంతుల నాగభూషణం, తిరందాస్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!