Miryalaguda : జిపిఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..!
మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో నూకల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిపిఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ని ట్రస్ట్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు.

Miryalaguda : జిపిఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో నూకల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిపిఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ని ట్రస్ట్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. గత సంవత్సరం ఎన్ వి ఆర్ యూత్, బీ ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో జి పి ఎల్ సీజన్ 1 ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా యువతను ప్రోత్సహిస్తూ జిపిఎల్ 2 ను నిర్వహించడం జరుగుతుంది.
ముఖ్య అతిథి నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎన్ వి ఆర్ యూత్, బి ఎల్ ఆర్ బ్రదర్స్ వారు యువతకు క్రీడా ప్రోత్సాహంతో పాటు యువతను సన్మార్గంలో నడిపించడానికి ఇటువంటి టోర్నమెంట్ తో పాటు జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు పిల్లలకు ఉదయం ఉచిత సమ్మర్ వాలీబాల్, హ్యాండ్ బాల్ కోచింగ్ తో పాటుగా చిన్నపిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ గేమ్స్ ఆడిపిస్తూ ప్రతి ఒక్కరికి ఒక గుడ్డుతో పాటుగా పౌష్టిక ఆహారం మరియు ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఇప్పుడు ఉన్న సాంకేతిక యుగంలో పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ఉంటున్నది కావున క్రీడాపూత్సాహం చాలా అవసరం వారి మానసిక ధైర్యానికి దేహ దారుణ్యానికి భవిష్యత్తులో వారి జీవితం లో ఎటువంటి కష్టాలు మానసిక ఒత్తిడిలను తట్టుకొని సమాజం లో నిలబడటానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు.
నూకల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిపిఎల్ టు క్రికెట్ టోర్నమెంట్ నియోజకవర్గంలో ఎంతో మంది క్రీడాకారులని వారి ప్రతిభని వెలికితీస్తూ రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదిగే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా మునుముందు జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడ వివిధ రంగాలలో పోటీలు నిర్వహించి ఇక్కడి నుండి జాతీయస్థాయి పోటీలలో పాల్గొనే విధంగా తయారు చేయటమే మా చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు మా ట్రస్టు ఎప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తామని తెలియజేశారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కౌన్సిలర్ ఆడోత్ అశోక్ నాయక్, ఫిజికల్ డైరెక్టర్ కన్నెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, 5 వ వార్డ్ కాంగ్రెస్ ఇన్చార్జి జవహర్ నాయక్, ఆర్గనైజర్ గడగోజు అశోక చారి, లక్ష్మణ్, మహేష్ , నాగరాజు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.










