మిర్యాలగూడ : లోటస్ స్కూల్ చిన్నారులకు.. అంతర్జాతీయ స్వర్ణ నంది పురస్కారాలు..!

మిర్యాలగూడ : లోటస్ స్కూల్ చిన్నారులకు.. అంతర్జాతీయ స్వర్ణ నంది పురస్కారాలు..!

మిర్యాలగూడ,  మనసాక్షి:

హైదరాబాద్ రవీంద్ర భారతి లో శాంతి కృష్ణ సేవా సమితి నిర్వహించిన అంతర్జాతీయ నృత్యోత్సవంలో మిర్యాలగూడ అశోక్ నగర్ లో గల లోటస్ స్కూల్ 9 వ తరగతి చదివే చిన్నారి గాయత్రి, ఏడవ తరగతి చిన్నారులు హైందవి, చిద్వి లాసినిలకు స్వర్ణ నంది పురస్కారాలు గెల్చుకున్నారు.

 

తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ,మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా స్వర్ణ నంది పురస్కారాలు అందుకోవడం జరిగింది. అదే విదంగా 2023 డిసెంబర్ 24 న హైదరాబాద్ లో జరిగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నృత్యోత్సవంలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు.

 

ALSO READ : 

  1. Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
  2. Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!
  3. UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!
  4. PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!

 

ఈ సందర్భంగా లోటస్ పాఠశాల చైర్మన్ బొడ్డుపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు తమ పాఠశాల ఎల్లవేళలా పనిచేస్తుందని పురస్కారం సాధించిన విద్యార్థులను సన్మానించి ,అభినందించారు.