సాగర్ ఆయకట్టుకు శాశ్వత పరిష్కారం.. ముఖ్యమంత్రి కేసీఆర్..!

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటితో గోదావరి జలాలను లింకు చేసి సాగర్ ఆయకట్టు రైతాంగానికి శాశ్వత పరిష్కారం కల్పిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు .

సాగర్ ఆయకట్టుకు శాశ్వత పరిష్కారం.. ముఖ్యమంత్రి కేసీఆర్..!

ఎన్నికల్లో ప్రజలు గెలవాలి 

భాస్కరరావును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలి

మిర్యాలగూడలోని ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటితో గోదావరి జలాలను లింకు చేసి సాగర్ ఆయకట్టు రైతాంగానికి శాశ్వత పరిష్కారం కల్పిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు .

ఈ ఏడాది నాగార్జునసాగర్ కు తక్కువ నీళ్లు వచ్చాయని, రైతులు ఇబ్బందులు పడటానికి చూశానని .. గోదావరి పుష్కలంగా ఉండటంవల్ల గోదావరి జలాలను నల్లగొండలోని ఉదయ సముద్రం కు తీసుకొచ్చి సాగర్ ఆయకట్టు రైతులకు శాశ్వత పరిష్కారం చూపిస్తా అన్నారు.

రైతుబంధు వృధా అని.. డబ్బులు దుబారా అని కాంగ్రెస్ నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డి , మరో కాంగ్రెస్ నాయకుడు రైతులకు మూడు గంటలు కరెంటు చాలని చెప్తున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను చూసి అక్కడ ప్రజలు మోసపోయారని అన్నారు. కర్ణాటకలో ఐదు గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నామని చెప్తున్నారు.

ALSO READ : BIG BREAKING : భాస్కర్ రావుకు న్యాయం చేయడమే అలవాటు.. నాకు కుడి భుజం గా ఉన్నారు..!

రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పరిపాలించిందని, వాళ్ళు సరిగా పాలించి ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధి అయిన మంచి నీటిని అందిస్తున్నామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో 30 వేల కోట్ల రూపాయలతో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు చొరవ తీసుకున్నారని చెప్పారు. ఈసారి భాస్కర్ రావుని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మీ కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పారు .

మంచి పనుల కోసం.. మంచి చేయాలనే తపన ఉన్న భాస్కర్ రావు లాంటి నాయకులను ఎప్పుడు గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ వచ్చిన తర్వాత తలసరి ఆదాయం పెరిగిందన్నారు. గతంలో 18 , 19వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.
తలసరి విద్యుత్ వినియోగంలో, మంచినీటి సరఫరా లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.

ALSO READ : ప్రజా వ్యతిరేక బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను ఓడించండి : ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి మత కల్లోలాలు లేవన్నారు. ఏనాడు కూడా కర్ఫ్యూలు విధించలేదన్నారు. అయినా ఎంపీ, అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి పై కత్తులతో దాడి చేశారని అన్నారు. తాము ఏనాడు కూడా అరాచకం చేయలేదని, ప్రజలకు మంచి చేశామని పేర్కొన్నారు. భాస్కర్ రావు నాకు కుడి భుజంగా ఉంటూ ఎప్పటికప్పుడు నాకు సలహాలు ఇస్తూ ఉన్నాడని అన్నారు. ముఖ్యమైన సమావేశాలు ఏదైనా భాస్కర్ రావు లేకుండా జరగదని పేర్కొన్నారు.

గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేశామని, వారి తండాలలో వాళ్ళదే రాజ్యం నడుస్తుందన్నారు. ఆసరా పెన్షన్లు పెంచి ఇస్తామని, కళ్యాణ్ లక్ష్మి ద్వారా పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందన్నారు.

ALSO READ : BIG BREAKING : టిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగింత..!

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగు లింగ యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్, మోసిన్ అలీ, నాగార్జున చారి, తదితరులు పాల్గొన్నారు.