మిర్యాలగూడ : 26వ తేదీ వరకు కార్యక్రమాలకు ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ దూరం..!

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఈనెల 26వ తేదీ వరకు శుభకార్యాలతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా దూరం ఉంటున్నట్లు తెలిసింది. బి ఎల్ అర్ మాతృమూర్తి గత నెల ఎన్నికల సమయంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

మిర్యాలగూడ : 26వ తేదీ వరకు కార్యక్రమాలకు ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ దూరం..!

మిర్యాలగూడ ,మన సాక్షి :

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఈనెల 26వ తేదీ వరకు శుభకార్యాలతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా దూరం ఉంటున్నట్లు తెలిసింది. బి ఎల్ అర్ మాతృమూర్తి గత నెల ఎన్నికల సమయంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత దశదినకర్మ కార్యక్రమాలతో పాటు వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఉన్న ఆయన ఇటీవలనే శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగయింది . అయినప్పటికీ ఆయన మాతృమూర్తి నెలవారి కార్యక్రమాలు ఈనెల 26వ తేదీన ఉన్నాయి.

ALSO READ: Miryalaguda : బి ఎల్ ఆర్ చుట్టూ చేరుతున్న వ్యతిరేక గుంపు..!

అందుకుగాను ఆయన శుభకార్యాలతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా ఈ నెల 26వ తేదీ వరకు దూరంగా ఉంటున్నట్లు ఆయన వర్గీయులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి కూడా ఈనెల 26వ తేదీ తర్వాతనే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. క్యాంపు కార్యాలయం సిద్ధంగా ఉన్నప్పటికీ 26వ తేదీ తర్వాత వెళ్ళనున్నట్టు ఆయన వర్గీయులు పేర్కొన్నారు.

ALSO READ : Runa Mafi : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీ పై కీలక ప్రకటన..!