Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

మిర్యాలగూడ : స్వలాభం కోసం పార్టీ ఫిరాయింపులు

మిర్యాలగూడ : స్వలాభం కోసం పార్టీ ఫిరాయింపులు

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

విధానాలపై పని చేసే వారిని చట్టసభలకు పంపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

 

పూటకో పార్టీ , రోజుకో పార్టీ మారే నాయకులు తయారయ్యారని, ప్రజా సంక్షేమాన్ని మరిచి సొంత స్వలాభం కోసం స్వార్థం కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొందని ప్రజలు అయోమయంలో ఉన్నారని చెప్పారు

 

పార్టీల నాయకుల తీరు అసహ్యించుకునే రీతిలో ఉందని విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజా ప్రయోజనాలు లేవని ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు.

 

ఎక్కువ మంది చదివిన వార్తలు మీరు కూడా చదవడానికి క్లిక్ చేయండి 👇

 

అధికారంలోకి వచ్చి ప్రజల సొమ్మును దోచుకునేందుకు అవినీతి అక్రమాలకు పాల్పడినందుకు రాజకీయ పార్టీల నాయకుడు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకులు కరువయ్యారని విధానాలపై మాట్లాడేది కేవలం వామపక్షాలేనని చెప్పారు.

 

వామపక్షాల ప్రతినిధులు చట్టసభలో ఉంటే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రజలు ఈ విషయాలను గుర్తుంచుకొని ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎంచుకోవాలని కోరారు.

 

ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు రవి నాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, భావండ్ల పాండు, గుణగంటి రామచంద్రు పాపిరెడ్డి, కోటిరెడ్డి, రామారావు, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు