Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : సాగర్ ఎడమ కాలువలో అంగన్వాడీ టీచర్ గల్లంతు ఆదుకోవాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు వినతి..!

Miryalaguda : సాగర్ ఎడమ కాలువలో అంగన్వాడీ టీచర్ గల్లంతు ఆదుకోవాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కు వినతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో రావువారిగూడెం అంగన్వాడీ టీచర్ అనూష ప్రమాదశాత్తు పడి మృతి చెందింది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు మెమోరాండం ఇవ్వటం జరిగినది.

ఈ సందర్భంగా ఏఐటియుసి, సిఐటియు నాయకులు మాట్లాడుతూ రావువారి గూడెం అంగన్వాడీ టీచర్ టి అనూష కామేపల్లిలో అంగన్వాడి సెంటర్ కు ఇన్చార్జిగా పనిచేస్తూ విధులు నిర్వహిస్తూ తిరిగి వస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు సాగర్ కాలులో పడి చనిపోయిందన్నారు.

ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నదని, రావువారిగూడెం అంగన్వాడి సెంటర్లో టీచర్ గా విధులు నిర్వహిస్తూ సిడిపిఓ ఆదేశానుసారంగా కామేపల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ కు అదనంగా బాధ్యతలు నిర్వహిస్తున్నది.

విధి నిర్వహణలో భాగంగా ఈనెల 5వ తేదీన అంగన్వాడి సెంటర్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించి తిరిగి రావువారి గూడెం వస్తున్న సందర్భముగా ప్రమాదవశాత్తు సాగర్ కాలలో పడి కొట్టుకుపోయి చనిపోయినది. ఆమె కుమారునికి, కూతురుకి ప్రభుత్వం బాధ్యత వహించి వారి చదువులకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నారు.

అదే విధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆమె మీద ఆధారపడి కుటుంబం నడిచేది అని, ఆ కుటుంబం దిక్కు తోచని పరిస్థితిలో ఉందన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం వైపు నుంచి 20 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు బంటు వెంకటేశ్వర్లు, ఎండి సయ్యద్, సిఐటియు నాయకులు మల్లు గౌతమ్ రెడ్డి, ఏఐటీయూసీ అంగన్వాడీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూచిత, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బైరెడ్డి రాణి, సబితా, భవాని, సక్కు, వనజ, వజ్రమ్మ, సిఐటియు అంగన్వాడి నాయకులు సైదమ్మ పార్వతి, రాధా బాయ్, అరుణ ధనలక్ష్మి మాధవి, అలివేలు, లక్ష్మీ, లలిత తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు