Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Sub Collector : బౌద్ధమ ఆలయాలలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ప్రత్యేక పూజలు..!

Sub Collector : బౌద్ధమ ఆలయాలలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ప్రత్యేక పూజలు..!

అడవిదేవులపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి గ్రామ శివారులోని కృష్ణా నది తీరాన ఉన్న బౌద్ధమ దేవాలయాలలో కొలువైయున్న పంచాయతన పార్వతీ పరమేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి, సూర్యనారాయణ స్వామివార్లను ఆదివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ దర్శించి,ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ఆలయ ప్రధాన అర్చకులు ఎడవల్లి రఘురామ శర్మ,అనంత కృష్ణ శర్మ వారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఆశీర్వాచనం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట తహసిల్దార్ సురేష్ బాబు,జవహర్ లాల్,హరిబాబు,మిర్యాలగూడ మండల ఆర్ఐ రామకృష్ణ, బండి నాగేశ్వరరావు, పసుపులేటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు