Miryalaguda : మిర్యాలగూడలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మిర్యాలగూడ రూరల్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.

Miryalaguda : మిర్యాలగూడలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మిర్యాలగూడ రూరల్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.రూరల్ ఎస్సై సతీష్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం రైల్వే శాఖలో పనిచేస్తున్న సురపాక దీపక్ రైల్వే క్వార్టర్స్ లో ఉంటూ బుధవారం రాత్రి విధులకు వెళ్లాడు.

ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులతో పాటు బీరువా తెరిచి దొంగలు బీరువాలో దాచి ఉంచిన 16 గ్రాముల బంగారు, కొంత నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ALSO READ : A man died : చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..!