Breaking Newsక్రైంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా
అదృశ్యమైన వ్యక్తి.. బావిలో శవంగా లభ్యం..!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలో గాజుల పాడ్ గ్రామానికి చెందిన మక్తే రమేష్ (45) వ్యవసాయ పొలం నుంచి వారం రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సోలార్ ప్లేట్ను దొంగలించారని, దానిని వెతికేందుకు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.

అదృశ్యమైన వ్యక్తి.. బావిలో శవంగా లభ్యం..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలో గాజుల పాడ్ గ్రామానికి చెందిన మక్తే రమేష్ (45) వ్యవసాయ పొలం నుంచి వారం రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సోలార్ ప్లేట్ను దొంగలించారని, దానిని వెతికేందుకు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శనివారం ఆయన భార్య కుషాల్ భాయి స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఆదివారం గ్రామ శివారులోని మక్దూం సబ్ వ్యవసాయ భూమిలో ఉన్న నీటి బావిలో రమేష్ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వైద్యులను రప్పించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ దుర్గారెడ్డి తెలిపారు.









