మిట్స్ కళాశాలలో భోగి సంబరాలు..!

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరున్న మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కరెస్పాండెంట్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి ఆద్వర్యంలో కళాశాల నందు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

మిట్స్ కళాశాలలో భోగి సంబరాలు..!

మదనపల్లి, మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరున్న మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కరెస్పాండెంట్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి ఆద్వర్యంలో కళాశాల నందు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

ALSO READ : మిర్యాలగూడ : సొంత అన్నని హత్య చేసిన తమ్ముడు.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు..!

భోగి మంట వేసి హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అని ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారని కరెస్పాండంట్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి అన్నారు.

ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే నన్నారు. ఈ సందర్బంగా విద్యార్తులు, వారి తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో ఆర్ ఆర్ ఆర్ అకాడమీ ప్రెసిడెంట్ ద్వారకానాథ్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : ప్రేమించి పెళ్లి చేసుకుని.. జల్సాలకు అలవాటు పడి, చివరికి ఇలా..!