తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్ ముత్తయ్యకు డాక్టరేట్

తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్ ముత్తయ్యకు డాక్టరేట్

సికింద్రాబాద్, మనసాక్షి:

గౌరవ డాక్టరేట్ అందుకున్న తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్ బి ముత్తయ్య. సికింద్రాబాద్ సీతాఫలమండీ లో జన్మించిన ముత్తయ్య పదవ తరగతి వరకు చదివు కున్నారు. ఆ తర్వాత అనేక పరిశ్రమలలొ పనిచేసిన ఆయన కార్మికులను చైతన్య పరిచి యూనియన్ స్థాపించడoలో కీలకపాత్ర పోషించారు.

 

ఉద్యోగం కోల్పోయిన తరువాత రైల్వే లో క్యాజువల్ లేబర్ గా చేరిన ఆయనను కొన్ని సంవత్సరాలకు తొలగిస్తే పెర్మనెంట్ చేయాలని కార్మికులను ఐక్యం చేసి కోర్టు ద్వారా పర్మినెంట్ అయ్యారు.రైల్వే లో కార్మికుల హక్కుల కోసం సమస్యల పరిష్కరాం కోసం పోరాటం చేసిన ముత్తయ్య యూనియన్ నాయకునిగా ఎదిగారు.

 

యూనియన్ పిలుపు మేరకు అనేక పోరాటాలు నిర్వహించి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర విభజన కోసం రైల్వే జె ఏ సి ఏర్పాటు చేసుకొని రైల్వే కార్మికుల ను సంఘటిత శక్తిగా మార్చి టీ జె ఏ సి భాగస్వామ్యంతో అనేక పోరాటాలు చేసి అన్ని రకాలుగా అన్యాయానికి గురైన చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తనవంతు పాత్రను పోషించారు.

 

ALSO READ : 

1. Anusuya : వెక్కి వెక్కి ఏడ్చుతున్న యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..!

2. కుల్కచర్ల లో నకిలీ అల్లం , వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!

3. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!

 

పధివి విరమణ తరువాత ఏ ఐ ఆర్ ఆర్ ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్ సి ఆర్),గా విధులు నిర్వహిస్తు,రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని డా:బాబా సాహెబ్ బి. ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంన్ని కాపాడుకోవాలని స్వచ్చంధ సంస్థ భారత్ బచావో ద్వార బావవ్యాప్తి ప్రచారంలో భాగంగా నేటికి తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు.

 

ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలోని సన్ రైస్ యూనివర్సిటీ ముతయ్యకు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించగా, గోవా వేదికగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.

 

ఈ సందర్భంగా ముత్తయ్య తనకు సహకారం అందించిన అల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్ ఫెడరేషన్ ఆధ్యాక్షులు సగరం శ్రీధర్,చిన్న రావు వెల్ఫేర్ సోసిటీ చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా ముత్తయ్యకు కార్మిక నాయకులు, బంధుమిత్రులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.