మిర్యాలగూడ : మృతుల కుటుంబాలకు భాస్కర్ రావు ఆర్థిక సహాయం

మిర్యాలగూడ : మృతుల కుటుంబాలకు భాస్కర్ రావు ఆర్థిక సహాయం
మిర్యాలగూడ, మనసాక్షి :
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పొందుగల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల వారికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆర్థిక సహాయం అందజేశారు. మృతులంతా దామరచర్ల మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన వారే కావడం వల్ల మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అదేవిధంగా చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున 60 వేల రూపాయలను అందజేశారు. అదేవిధంగా గాయాలైన వారికి చికిత్స కోసం 50 వేల రూపాయలను అందించారు. అంతేకాకుండా గాయాలైన వారి చికిత్స పూర్తిగా తానే చేయిస్తానని పేర్కొన్నారు. ఈ సంఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, వీర కోటిరెడ్డి, హతీ రామ్ నాయక్, యూసుఫ్, లక్ష్మి తదితరులు ఉన్నారు.