Miryalaguda | మానవత్వం చాటిన ఎమ్మెల్యే భాస్కర్ రావు

మానవత్వం చాటిన ఎమ్మెల్యే భాస్కర్ రావు

వేములపల్లి , మన సాక్షి :

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మానవత్వం చాటారు. నియోజకవర్గంలోని వేములపల్లి మండల కేంద్రంలో శనివారం తెలంగాణ రైతు దినోత్సవ వేడుకలలో పాల్గొని తిరిగి మిర్యాలగూడకు వెళ్తున్నారు.

 

మార్గమధ్యలో శెట్టిపాలెం వద్ద బైకు లారీని ఢీకొనడంతో ఓ యువకునికి ప్రమాదం జరిగింది. జరిగిన ప్రమాదాన్ని గుర్తించి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Also Read : Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్ స్క్రీన్ షేరింగ్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

 

చికిత్స నిమిత్తం తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భాస్కర్ రావు అధికారులకు సూచించారు.