Miryalaguda : నిరుపేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..!
Miryalaguda : నిరుపేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడ మండలం, లక్ష్మీపురం గ్రామంలో ఇండ్లు లేని 80 మంది నిరుపేదలకు ఎం ఎల్ సి శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన వాగ్దానాలన్నింటిని నెరవేరుస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలను అమలు చేసి ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంటున్నదని చెప్పారు.
ప్రత్యేకించి లక్ష్మీపురంలో నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకుగాను 2022 లో 437 సర్వే నంబర్లో నాలుగు ఎకరాల 37 కుంటల భూమిని భూమి కొనుగోలు పథకం కింద కొనుగోలు చేసినప్పటికీ గత ప్రభుత్వం అప్పటినుండి పెండింగ్ లో పెట్టడం జరిగిందని తెలిపారు. తాను ఎం ఎల్ ఏ అయిన తర్వాత గుట్టలతో నిండి ఉన్న ఈ స్థలాన్ని చదును చేయించి, లే అవుట్ ఏర్పాటు చేసి పట్టాలివ్వడం జరిగిందన్నారు.
ఇందుకు కృషి చేసిన స్థానిక రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్, తహసిల్దార్ ల పాత్ర మరువలేనిదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎక్కడా లేనివిధంగా 80 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలివ్వడం సంతోషంగా ఉందన్నారు. పట్టాలు ఇచ్చిన ఈ ఇంటి స్థలాలలోనే ఇందిరమ్మ ఇండ్లను సైతం నిర్మించి. ఇస్తామని, ఇందిరమ్మ కాలనీగా ఏర్పాటు చేస్తామనిచెప్పారు.
దీనిని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని పట్టాలు పొందిన వారందరికీ ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. ఎం ఎల్ సి శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మిర్యాలగూడ తహసిల్దారు హరి తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Hyderabad : హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం..!
-
Miryalaguda : భూభారతిలో ప్రతి ఏటా డిసెంబర్ 31న భూముల వివరాల ప్రదర్శన.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!
-
Miryalaguda : నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ గా నారాయణ్ అమిత్.. బాధ్యతల స్వీకరణ..!
-
District Collector : భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు భూభారతి మంచి అవకాశం.. జిల్లా కలెక్టర్..!
-
Miryalaguda : ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు.. విచారణ జరపి చర్యలు తీసుకోవాలి..!









