Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District Collector : భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు భూభారతి మంచి అవకాశం.. జిల్లా కలెక్టర్..!

District Collector : భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు భూభారతి మంచి అవకాశం.. జిల్లా కలెక్టర్..!

నల్లగొండ, మన సాక్షి:

భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు భూభారతి మంచి అవకాశం అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతి చట్టం- 2025 పై రైతులకు కల్పిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా గురువారం ఆమె నల్గొండ జిల్లా, నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ధరణిలో గుర్తించిన లోపాలన్నింటిని భూ భారతి ద్వారా సరిచేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. జూన్ 2 నుండి భూ భారతి చట్టం అందుబాటులోకి రానుందని,రైతులు వారి భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకొనేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ధరణి లో వీఆర్వో వ్యవస్థను తీసివెయడం జరిగిందని, దీనివల్ల ఇబ్బందులు ఏర్పడగా, తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారిని నియమించనున్నదని తెలిపారు.

జిల్లాలో 33 మండలాలు ఉండగా, 12 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, ఎవరైనా భూములను అన్యాక్రాంతం చేసిన లేదా వివాదాలు ఏర్పడినప్పుడు సర్వే నిర్వహించేందుకు సర్వేయర్ల కొరత ఉందని ,ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి సర్వే సమస్యలను తీర్చనున్నట్లు ఆమె తెలిపారు.

సాదా బైనామా, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు గతంలో సిసిఎల్ఏ కు అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు భూ భారతిలో సరిచేసే అధికారం ఆర్డీవో కు ఉందని, అలాగే పొరపాట్లు, తప్పులు సరి చేసే అవకాశం 90 శాతం తహసిల్దార్ తోనే పరిష్కారం అవుతాయని తెలిపారు.

రైతులకు రుణాలు అవసరం అయితే బ్యాంకులో భూమి కాగితాలు ,ఇతర డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని, భూ భారతి పోర్టల్ ఆన్లైన్లో నమోదైన వివరాల ఆధారంగా రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. భూ భారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాంపల్లి మండలంలో ఆర్ ఐ కొరతను దృష్టిలో ఉంచుకొని ఒక ఆర్ఐని నియమించడం జరిగిందని వెల్లడించారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు నర్సిరెడ్డి మాట్లాడుతూ భూ భారతి చట్టం వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని ,అధికారులు రైతులకు న్యాయం చేసే దిశగా కృషి చేయాలని కోరారు. చండూరు ఆర్డీవో శ్రీదేవి మాట్లాడుతూ భూ భారతి, ధరణి మధ్య ఉన్న తేడాలు, ప్రయోజనాలను వివరించారు.

ఈ సందర్భంగా రైతులు భూములకు సంబంధించిన సమస్యలను వివరించారు.అంతకు ముందు తహసిల్దార్ దేవసింగ్ భూ భారతి చట్టం లోని సెక్షన్లు, ఇతర అంశాలపై రైతులకు తెలియజేశారుమండల ప్రత్యేక అధికారి, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏ డి శ్రీనివాస్, ఎంపీడీవో శర్మ, తదితరులు ఉన్నారు.

MOST READ :

  1. Suryapet : జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పి..!

  2. ATM : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  3. Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)

  4. SBI: FY 25 ఫలితాలు ప్రకటించిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్.. 112% పెరిగిన లాభం..!

  5. Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో సెయింట్ జాన్స్ విద్యార్థుల ప్రభంజనం..!

మరిన్ని వార్తలు