శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా..!

గచ్చిబౌలిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపనలు

శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా..!

గచ్చిబౌలిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపనలు

శేరిలింగంపల్లి ,మన సాక్షి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రూ.1 కోటి 24 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు.

సోమవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల, శ్రీకృష్ణ కాలనీ, నవోదయ కాలనీ, రాజీవ్ నగర్,ఎన్టీఆర్ నగర్ కాలనీలలో రూ.1 కోటి 24 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్ శంకుస్థాపనలు చేశారు.

ALSO READ : Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!

ఈ సందర్బంగా విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని విప్ గాంధీ అధికారులకు సూచించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్ అభిషేక్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు,చ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,

ALSO READ : Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!

బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, జంగయ్య యాదవ్, మంత్రిప్రగడ సత్యనారాయణ, సురేందర్, ప్రసాద్, మల్లేష్, వినోద్, శంకరి రాజు ముదిరాజ్, నాగపూరి అశోక్, జగదీశ్, రమేష్ గౌడ్, సల్లావుద్దీన్, అక్బర్, నారాయణ, నర్సింహ రాజు, నవాజ్, శ్రీనివాస్, భిక్షపతి, ఫయాజ్, వెంకటేష్, హాసన్, ఖాదర్ ఖాన్, తాహీర్, అరుణ, రాణి, బాలమణి, మాధవి, లత, సుగుణ , కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ ;

  1. Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!
  2. Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!