MLA : ఎమ్మెల్యే షాజహాన్ భాషా సుడిగాలి పర్యటన..!
MLA : ఎమ్మెల్యే షాజహాన్ భాషా సుడిగాలి పర్యటన..!
రామసముద్రం, మనసాక్షి :
రామసముద్రం మండల సర్వతో ముఖాభివృద్ది కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే షాజాహాన్ బాషా తెలిపారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మంగళవారం మండల పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యే పెద్దకుర ప్పల్లె గ్రామ పంచాయతీ తిరుమలరెడ్డిపల్లె గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా కు మహిళలు మంగళహారతులు పట్టి ఘనస్వాగతం పలికారు.
ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే 3 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించామని, తాగునీటి కోసం అవసరమైన చోట, కొత్త బోర్లు వేయటానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. రాబోయే వేసవిని ద్రుష్టి ఉంచుకొని తాగునీటి అవసరాలకోసం కొత్త బోర్లు, ఓవర్ హెడ్ ట్యాంక్ లు నిర్మించాలని ఎంపిడిఓ భానుప్రసాద్ కు ఆదేశాలించారు. ఇందుకు సంబందించిన స్థలమును చూడాలని తాహిసీల్దార్ నిర్మలాదేవిని ఆదేశించారు.
అలాగే సంఘ మిత్రాల కార్యాకలాపాలు నిర్వహించడానికి మండలంలోని అన్ని సంఘాలకు భవనాలకు స్థలాలు చూపాలని తాహిసీల్దార్ కు ఆదేసించారు. మదనపల్లి- రామసముద్రం రోడ్డు విస్తరణ పనులు, మండలానికి హంధ్రీ నీవా జలాలు తీసుకురావడానికి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.మండలంలోని ప్రతి పంచాయతీలో పశువుల తాగు నీటి సౌకర్యం కోసం నీటి తొట్టెలు నిర్మిస్తున్న ట్లు ఆయన తెలిపారు.
రాబోయే రెండునెలల్లో పారిశుద్యం కోసం మురికి కాలువలు నిర్మాణం కోసం చర్య లు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే షాజాహాన్ బాషా తెలిపారు.ఇందులో భాగంగా పశువుల నీటి తొట్టెలు నిర్మాణం కోసం కాప్పల్లె గ్రామంలో ఎమ్మెల్యే షాజాహాన్. బాషా, టిడిపి నాయకులు లోకనాథ్ రాజు, టిడిపి నాయకులు భూమి పూజ చేసారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిప్పన్న,టిడిపి నేతలు రూపేష్ రెడ్డి,అన్సర్ బాషా సీతారామస్వామి చెంబకూరు వెంకటేష్,ఇలియాజ్ భాషా, నడింపల్లె రమేష్ ,మండల బి సి సెల్ అధ్యక్షుడు రెడ్డెప్ప,హోటల్ నారాయణ స్వామి, ఏ పి మోడల్ స్కూల్ చైర్మన్ బాలాజీ , ఏ పి ఓ మాధవి, ఏపీఎం సాంబశివ, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ లు పాల్గొన్నారు.
MOST READ :
-
Pumpkin seeds : గుమ్మడి గింజలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.. లేదంటే డేంజరే..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆ నెంబర్లు పనిచేయవు..!
-
Traffic : మీ బండ్లకు, కార్లకు ఈ చలాన్లు చెల్లించడం లేదా.. అయితే భారీ షాక్.. కొత్త పెనాల్టీలు..!
-
LPG : భారీగా తగ్గిన LPG సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు..!
-
Gold Price : తగ్గేదేలే అంటున్న పసిడి ధర.. లక్షకు చేరువలో..!









