Breaking Newsfoodజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Suryapet : సూర్యాపేటలో ఆహార నిబంధనల ఉల్లంఘన.. రూ.69,500 జరిమానా..!
ఆహార భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన వారిపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది.

Suryapet : సూర్యాపేటలో ఆహార నిబంధనల ఉల్లంఘన.. రూ.69,500 జరిమానా..!
సూర్యాపేట, మనసాక్షి :
ఆహార భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన వారిపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో 7 అడ్జుడికేషన్ కేసులను విచారించి మొత్తం రూ.69,500 జరిమానా విధించారు. కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలు విక్రయిస్తే భారీ జరిమానాలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఉమ్మడి జిల్లా జోనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి హెచ్చరించారు.
ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా నిరంతర తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు. వివరాలను ఫాస్కోస్ పో ర్టల్లో పొందుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏఎఫ్సీ, ఎఫ్ఎస్వో ప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు అన్నారు.









