ఎమ్మెల్యే అనుచరులకే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు..!
ఎమ్మెల్యే అనుచరులకే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు..!
సిపిఎం మండల కార్యదర్శి వజ్జ శ్రీనివాస్ యాదవ్
అర్వపల్లి , మన సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే అనుచరులకి వస్తున్నట్లు సిపిఎం మండల పార్టీ కార్యదర్శి వజ్జె శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
గురువారం మండల పరిధిలోని రామన్నగూడెం లో సూర్యాపేట జనగాం 365 ప్రధాన రహదారిపై నిరసన తెలియజేస్తూ ధర్నా నిర్వహించారు.
దళిత బంధు , బీసీ బందు, గృహలక్ష్మి, గొర్రెల పంపిణీ, లాంటి అనేక సంక్షేమ పథకాలను స్థానిక ఎమ్మెల్యే అనుచరులకి కేటాయించినట్లు ఆరోపించారు. రామన్నగూడెం గ్రామంలో కూడు , గుడ్డ , గూడు, లేని అనేకమంది కుటుంబాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదని అన్నారు.
ALSO READ : మునుగోడు : దద్దమ్మను గెలిపించి నియోజకవర్గాన్ని వెనుకబడేటట్లు చేశారు..!
ఇండ్లు భూములు ట్రాక్టర్లు బైకులు ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమేసంక్షేమ పథకాలు వస్తున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అధికారులు వచ్చి నిష్పష్పాతంగా విచారణ చేసి అర్హులకు సంక్షేమ కార్యక్రమాలను అందించాలని కోరారు.
మండల కేంద్రంలో ఎమ్మెల్యే కార్యక్రమం ఉండటంతో పోలీసు వాళ్ళు నిరసనకారులను చదరగొట్టి ధర్నాను విరమింప చేశారు.
ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ గ్రామ అధ్యక్షుడు జమడకుంట్ల కృష్ణయ్య, సిపిఎం మహిళా నాయకురాలు ఆదెమ్మ, వినయ్ యాదవ్, పనస భద్రయ్య ,వెంకన్న, అంకిరెడ్డి రాములు, జానయ్య, జె సుధాకర్, రమావత్ ఎంకన్న ,రాములు, భద్రమ్మ రాములమ్మ చౌడమ్మ సోమ జానయ్య చెడిపల్లి ముత్తయ్య గుగ్గిల నాగయ్య పాల్గొన్నారు.









