Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

మునుగోడు : దద్దమ్మను గెలిపించి నియోజకవర్గాన్ని వెనుకబడేటట్లు చేశారు..!

మునుగోడు : దద్దమ్మను గెలిపించి నియోజకవర్గాన్ని వెనుకబడేటట్లు చేశారు..!

ఎమ్మెల్యే  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మర్రిగూడ , సెప్టెంబర్ 21, మన సాక్షి:

సరంపేట గ్రామంలో    ST SDF  గ్రాంట్  7 కోట్లతోని  సరం పేట టు  భీమనపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణం
రాజపేట తండ లో నూతన  గ్రామపంచాయతీ  భవన నిర్మాణానికి SDF  గ్రాంట్ 20 లక్షల రూపాయలు
ఖుదాబక్ష్‌పల్లి   గ్రామం నుండి  సాయి బండ తండ వరకు బ్రిడ్జి నిర్మాణం కోసం FDR  గ్రాంట్ 45.60  లక్షల  ఎమ్మెల్యే కోసంల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని  నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఉప ఎన్నికలలో గెలిచి ఆరు నెలలు  ఇప్పటివరకు 600 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

ALSO READ : Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. పంట రుణాల మాఫీకి వెయ్యి కోట్లు విడుదల..!

2018లో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే  గెలిచి నాలుగు సంవత్సరాలు ఉన్న ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు.  ఇలాంటి చేతగాని దద్దమ్మను గెలిపించి మునుగోడు నియోజకవర్గాన్ని  అన్ని రంగాల్లో వెనుకబడేటట్లు చేశారు.

ఉప ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తూ అన్ని సంక్షేమ పథకాలను నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నానని, ఇదేవిధంగా చర్లగూడెం రిజర్వాయర్ పనులు పూర్తి కావాలంటే మళ్లీ తనని గెలిపించాలని ప్రజలను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోరారు.

ALSO READ : Nalgonda : నల్గొండలో విచిత్ర దొంగలు.. వాళ్లు దోచుకునేవి ఏంటో తెలుసా..!

ఈ కార్యక్రమంలో  ఎంపీపీ  మెండు మోహన్ రెడ్డి. జడ్పిటిసి  పాశం సురేందర్ రెడ్డి.  సర్పంచులు  ఆంబోతు సుధాకర్ నాయక్, వినమల్ల వెంకటమ్మ, సక్కుబాయి, నల్లయాదయ్య, ఐతపాక జంగయ్య, ఎంపిటిసిలు విష్ణు, బంతిలాల్ , సహకార సంఘం చైర్మన్ పందుల యాదయ్య,  బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తోటకూర శంకర్.

దళిత బంధు జిల్లా డైరెక్టర్  లపంగి నరసింహ. రైతుబంధు  మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ.  బిఆర్ఎస్ జిల్లా నాయకులు చెరుకు లింగం గౌడ్. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటరమణారెడ్డి. మర్రిగూడ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్ రజాక్.  వర్కాల వెంకటేష్.  గిరి నేత. తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :

  1. మహిళలకు 33% రిజర్వేషన్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాను వెంటనే ప్రకటించాలి
  2. BIG BREAKING : టీచర్ల బదిలీలు, పదోన్నతులకు బ్రేక్..!

మరిన్ని వార్తలు