Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Mlc By Elaction : ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్..!

Mlc By Elaction : ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్..!

నారాయణపేట టౌన్,  మన సాక్షి :

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ గురువారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ నంబర్ 3 లో గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది.

జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గo ( కోయిల కొండ మినహా), మక్తల్ నియోజకవర్గంతో ( అమరచింత, ఆత్మకూర్ మినహా) పాటు, కోస్గి, మద్దూర్ మండలాలకు చెందిన జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ ఎఫిసియో సభ్యులైన నారాయణపేట, మక్తల్ ఎమ్మెల్యేలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం సాయంత్రం ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు 99.51 శాతంగా పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తo 205 మంది ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ ఓటర్లు ఉండగా వారిలో 89 మంది పురుషులు, 116 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసే సమయంలోపు మొత్తం 204 మంది ప్రజా ప్రతినిధులు ఓటు వేశారు. మక్తల్ మండలం మంతన్ గోడ్ ఎంపిటిసి సభ్యురాలు సుమిత్ర తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అయితే ఓటు హక్కు వినియోగించుకున్న 204 మంది ఓటర్లలో 115 మంది మహిళలు, 89 మంది పురుషులు ఉన్నారు.

ALSO READ : Corruption of VBKs : సంఘ బంధాలలో విబికెల అవినీతి.. విచారణ జరపాలని సభ్యుల డిమాండ్..!

జిల్లాలోని 11 మంది జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, 137 మంది మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు, 54 మంది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పట్టణ స్థానిక సంస్థల ఎక్స్ ఆఫీషియో సభ్యులైన నారాయణపేట, మక్తల్ శాసనసభ్యులు డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి, వాకిటి శ్రీహరి లు నారాయణపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

స్థానిక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ మయాంక్ మిత్తల్ పరిశీలించారు. కాగా పోలింగ్ కేంద్రం వద్ద గత రెండు రోజులుగా నారాయణపేట డిఎస్పి నల్లపు లింగయ్య ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని సి. ఐ. లు, ఎస్. ఐ. లు, పోలీసు కానిస్టేబుళ్లు, సిఆర్ పి ఎఫ్ బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ ను ఎస్కార్ట్ బందోబస్తు మధ్య మహబూబ్ నగర్ కు తరలించారు.

ALSO READ : KTR : యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరిక.. పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం..!

మరిన్ని వార్తలు