మిర్యాలగూడలో.. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మిర్యాలగూడలో..
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మిర్యాలగూడ, మనసాక్షి : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆదివారం తెల్లవారుజామున ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు లో గుర్తుతెలియని వాహనం ఢీకొని, గుర్తు తెలియని వ్యక్తి (40) చనిపోయాడు. కాగా మృతి చెందిన వ్యక్తి పట్టణంలో యాచకుడుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వీఆర్వో గోపి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
1. యువతిపై నలుగురు యువకుల అత్యాచారయత్నం, వీడియో తీసిన మరో మహిళ
2. బావిలో శవమై తేలిన ముగ్గురు అక్క చెల్లెలు, ఇద్దరు చిన్నారులు
3. BREAKING : విమానం ఆచూకీ గల్లంతు, 22 మంది ప్రయాణికులు, నలుగురు భారతీయులు