అక్కడ తెల్లవారుజామున 6 గంటల నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్..!

కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోసారి ఉత్తరాది రైతాంగం ఉద్యమాలు చేపట్టనున్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు కూడా రూపొందించారు.

అక్కడ తెల్లవారుజామున 6 గంటల నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మరోసారి ఉత్తరాది రైతాంగం ఉద్యమాలు చేపట్టనున్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు కూడా రూపొందించారు.

2021లో రైతులు ఆందోళన చేసి దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన దీక్షలు కొనసాగించిన విషయం తెలిసిందే. ఆ దీక్షలు ఏడాది కాలం పాటు కొనసాగాయి. ఎంతోమంది రైతులు కూడా చనిపోయారు. కాగా ఇప్పుడు మరోసారి రైతాంగం రోడ్డుఎక్కడానికి సిద్ధపడింది. ఈనెల 13వ తేదీన చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ ., సంయుక్త కిసాన్ మోర్చా , కిసాన్ మజ్దూర్ మోర్చా ,లాంటి 200 కు పైగా రైతు సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. చలో ఢిల్లీ కార్యక్రమంలో మూడు లక్షల మంది రైతులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. ఉత్తర ప్రదేశ్, హర్యానా ,పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లతో ఢిల్లీకి తరలి వెళ్ళనున్నారు. అందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది.

ALSO READ : BREAKING : రైతుబంధు అందరికీ రాదు, వారికి మాత్రమే వస్తుంది.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంతోపాటు తాము ప్రతిపాదించిన డిమాండ్లను అంగీకరించాలని రైతు సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా ,నిత్యానంద రాయితో కూడిన కమిటీ రైతు సంఘాల నేతలతో తొలివిడతగా జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. రైతు నాయకులు పెట్టిన డిమాండ్లను డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఈ నిరసన కార్యక్రమాన్ని విరమించుకోలేదు.

ఈనెల 13వ తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం యధావిధిగా కొనసాగాలని తీర్మానించడం జరిగింది. హర్యానా ప్రభుత్వం అందుకు అప్రమత్తమయింది. అంబాల, కురుక్షేత్ర, ఖైతల్, జిందగీ, సార్ ,ఫతేబాద్,.. లాంటి లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.

ALSO READ : ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.5లక్షల సహాయం..!

మొబైల్ ఇంటర్నెట్ ,బల్క్ ఎస్ఎంఎస్, మొబైల్ నెట్వర్క్ ,కంపెనీలు ప్రొవైడ్ చేసే సర్వీసులను ఆదివారం తెల్లవారుజామున 6 గంటల నుంచి నిలిపివేయనున్నట్లు తెలిపింది. 13వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండబోవని తెలియజేసింది.