MODEL COLLEGE : మోడల్ కాలేజిలో ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం

ఈ నెల 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరి తేదీ మే 30 

MODEL SCHOOL : మోడల్ కాలేజిలో ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం

ఈ నెల 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరి తేదీ మే 30 

జూన్‌ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం

మహేశ్వరం (మన సాక్షి)

తెలంగాణ మోడల్ జూనియర్‌ కళాశాల మహేశ్వరం నందు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని మహేశ్వరం మోడల్ కాలేజ్ ప్రిన్సిపాల్ బి ధనుంజయ్ ఒక ప్రకనలో పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి అడ్మిషన్ల కొరకు అప్లై చేయదలచినవారు మోడల్ స్కూల్ మహేశ్వరం నందు పదవ తరగతి మెమో,టీసి, ఆధార్ కార్డ్ మరియు ఒక ఫోటో తీసుకొని వచ్చి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ ,బైపీసీ , సీఈసీ, ఎంఈసి ప్రతి గ్రూపులో 44 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.పదవ తరగతిలో వచ్చిన జి పి ఏ ఆధారంగా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.

ALSO READ : KTR : కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

మోడల్ కళాశాల ప్రత్యేకతలు :

విశాలమైన ప్రాంగణం అధునాతన బిల్డింగ్, సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ అనుభవం కలిగిన అధ్యాపకులచే నాణ్యమైన విద్యా బోధన,దూర ప్రాంతం నుంచి వచ్చే బాలికలకు కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి, విశాలమైన లైబ్రరీ ,

సబ్జెక్టుల వారీగా ల్యాబ్స్ సౌకర్యం విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ,హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయంతో కంప్యూటర్ ల్యాబ్, గూగుల్ ఈ-క్లాస్ రూమ్ రిటైల్ మేనేజ్మెంట్, టూరిజం, హాస్పటిలిటీ కోర్సులలో ఓకేషనల్ విద్య వివరాలకై క్రింది నంబర్లకు 9849746567, 9912617121,9603150011 సంప్రదించాలని ధనుంజయ తెలిపారు.