మోడీ నోరు తెరిస్తే అన్ని పచ్చి అబద్ధాలే – సబితా ఇంద్రారెడ్డి
మోడీ నోరు తెరిస్తే అన్ని పచ్చి అబద్ధాలే – సబితా ఇంద్రారెడ్డి
ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీఎల్ రమణ, కిషన్ రెడ్డి
మహేశ్వరం, (మన సాక్షి)
కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండానే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ కేంద్రం లక్ష్మీ గార్డెన్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ,ఎమ్మెల్సీ ఎల్ రమణ రాష్ట్రగ్రంధా లయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మున్సిపల్ అధ్యక్షుడు జి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. తుక్కుగుడలో మంత్రి కి భారీ ర్యాలీ తో గజ మాల తో ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పతి నియోజక వర్గంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చెయ్యాలని సీఎం కేసీఆర్ కోరిక మేరకు తుక్కుగుడ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి పాల్గొన్నారు. దేశ రాజకీయాలను ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న గొప్ప నేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు.
మహేశ్వరం నియోజక వర్గం తుక్కుగూడ మున్సిపల్ కేంద్రం లక్ష్మి గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. పార్టీ కార్యకర్తలే బీఆర్ఎస్ బలగమని దేశంలోని ఎదురులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీ అవతరించిందన్నారు. ప్రజల క్షేమం కోసం తెలంగాణ సర్కార్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని ప్రతి వాడను అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిస్తుందని అన్నారు. అదేవిధంగా మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజలు తెలంగాణ ప్రభుత్వం తరపున ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేదని సహకారం అందించకపోగా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, మంత్రులు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఇద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణకు చేసిన అభివృద్ధితో శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రధానమంత్రి మోడీని ప్రశ్నించారు. అమాయక ప్రజల మధ్య మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప బిజెపి నాయకులకు తెలిసింది ఏమీ లేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నయని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వ లేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై కుట్ర చేస్తుందని మంత్రి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బిజెపి నాయకులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారని మంత్రి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా, రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, దళిత బంధు, వృద్ధులకు 2000 రూపాయల పెన్షన్ బిజెపి పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలోని ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ముచ్చటగా బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు జి లక్ష్మయ్య,, మహిళా అధ్యక్షురాలు పద్మ భాస్కర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు సామెల్, రాజు,మున్సిపల్ వైస్ చైర్మన్ భవాని వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు సప్పిడి లావణ్య రాజు, బాధావత్ రవి నాయక్,
బూడిద తేజస్విని శ్రీకాంత్ గౌడ్, రెడ్డి గళ్ళ సుమన్, నియోజకవర్గ నాయకులు అరవింద్ శర్మ, బేర బాలకిషన్, చంద్రయ్య,మహేశ్వరం పార్టీ అధ్యక్షుడు రాజు, బుచ్చిరెడ్డి, గోనెమోని శివశంకర్, సురగిరి ఎల్లమ్మ ఆలయ డైరెక్టర్ నర్సింగ్ గౌడ్, పెంటమల్ల సురేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











