మోడీ రాష్ట్రం లో ఇచ్చేది ఆరు గంటల కరెంట్

గతం లో పాలించిన జెండాలు ఊర్లను ముంచితే.. సంక్షేమ పథకాలతో లేపింది గులాబీ జెండా

మోడీ రాష్ట్రం లో ఇచ్చేది ఆరు గంటల కరెంట్

ఘనత వహించిన నేతలు పాలించిన ప్రాంతాల్లో 2014 కు ముందు త్రాగు నీరు కూడా దొరకలేదు

గతం లో పాలించిన జెండాలు ఊర్లను ముంచితే.. సంక్షేమ పథకాలతో లేపింది గులాబీ జెండా

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట రూరల్, 22 సెప్టెంబర్, మన సాక్షి: సిఎం కేసీఆర్ తోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట రూరల్ మండలం సోలిపేట గ్రామం లో కోటి 50లక్షల వ్యయం తో నూతనంగా నిర్మించిన పశువుల ఆసుపత్రి, ఎస్సీ కమ్యూనిటీ హాల్, బస్ షెల్టర్ , అంబెడ్కర్ విగ్రహం, గ్రామ ముఖ ద్వారం, కళా వేదికలను మంత్రి ప్రారంభించారు… వ్యాయమ శాల కు శంకుస్థాపన కూడా చేసిన మంత్రి నూతన పెన్షన్ లబ్దిదారులకు గుర్తింపు కార్డ్ లను అదజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నదన్న మంత్రి గ్రామాలలో నివసిస్తున్న ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నారని వివరించారు. గోదావరి జలాలతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయన్నారు. 2014 కు ముందు పాలించిన జెండాలు గ్రామాలను నిండా ముంచితె, ప్రతీ గ్రామానికి కోట్ల రూపాయలు తెచ్చి లెపింది గులాబీ జెండా అని మంత్రి అన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో సైతం నేటికీ వ్యవసాయానికి ఇస్తున్న కరెంట్ కేవలం 6గంటలు మాత్రమే అని మంత్రి హెద్దేవా చేశారు. 2014 కు ముందు మేమే గొప్ప నాయకులం అని చెప్పుకునే పాలకుల హాయం లో కనీసం త్రాగడానికి నీరు దొరకలేదని మంత్రి విమర్శించారు..2014 లో సంక్షేమ పథకాల సంగతి దేవుడేరుగు పెన్షన్ ల రూపం లో గ్రామానికి పది వేలు వస్తెనే గగన మయ్యే పరిస్తితి ఉంటే ,నేడు అదే పెన్షన్ ల రూపం లో వెయ్యి జనాభా గల గ్రామానికి 5లక్షల రూపాయలకు పైగా ఇస్తున్న ఘనత టీ. ఆర్. ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని అన్నారు.

ఇక రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి,24 గంటల కరెంట్ వంటి పథకాల తో పాటు పంచాయితీ ల పరిది లో అంతర్గత రహదారులు , సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల లో జీవన ప్రమాణాలు పెంచారని కొనియాడారు. గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభ సూచకం అన్న మంత్రి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ మే 75ఏళ్లుగా దేశాన్ని నడిపిస్తుందనీ అన్నారు. కుల రహిత సమాజమే అసలైన అభివృద్ధి అన్న మంత్రి 8 ఏళ్లుగా రాష్ట్రం లో కులాలకు, మతాలకు , రాజకీయలకు అతీతంగా జరుగుతున్న అభివృద్దే దేశం లో తెలంగాణ ను నంబర్ వన్ గా నిలబెట్టింది అని మంత్రి అన్నారు.. దేశ ప్రజలు , మేదావులు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

కార్యక్రమం లో ఎంపిపి బీర వోలు రవీందర్ రెడ్డి, జడ్పీటిసి జీడి బిక్షం, డీసీఎం ఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, యాదగిరి ముదిరాజ్, చల్లా సురేందర్ రెడ్డి, వైస్ ఎంప్పే శ్రీనివాస్ నాయుడు, సర్పంచ్ శోభా రాణి, మాలి అనంత రెడ్డి, చిత్రం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.