వేములపల్లి : ఆడబిడ్డ కుటుంబాలకు అండగా .. ఆ ఎంపీటీసీ

ఆడబిడ్డ కుటుంబాలకు అండగా .. ఆ ఎంపీటీసీ

నూతన సేవా కార్యక్రమాని ప్రారంభించిన ఎంపిటిసి 

వేములపల్లి , మన సాక్షి:

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో వివాహం చేసుకునే ఆడపిల్లలకు శ్రీరామ కళ్యాణ కానుక నూతన సేవ కార్యక్రమానికి ఆదివారం ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ…

 

.గ్రామంలో ఆడపిల్ల వివాహం చేసే తల్లిదండ్రులకు వివాహ సమయంలో ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో నూతన సేవా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పదివేల రూపాయల విలువగల వంట సామాగ్రిని అందజేయనున్నట్లు తెలియజేశారు.

 

సేవా కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తరి సైదులు,గ్రామ శాఖ అధ్యక్షులు సందనబోయిన చంద్రయ్య,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కందుల నాగిరెడ్డి,

 

వార్డు మెంబర్లు వంగాల సంజీవ చారి,బరిగల బిక్షం,చీమల వెంకన్న, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, రవీందర్ రెడ్డి,శీలం జగన్,గండ్ర రాము, పొడిశేటి సైదులు, నాగేందర్,కత్తుల సైదులు,శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.