Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESజిల్లా వార్తలునల్గొండసామాజిక సేవ

యువతకు మార్గదర్శి ‘ముకేష్’

యువతకు మార్గదర్శి ‘ముకేష్’

రంజాన్ కిట్ల పంపిణీ అభినందనీయం – హమీద్ షేక్

మిర్యాలగూడ , మనసాక్షి :

నల్గొండ జిల్లా
మిర్యాలగూడ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నర్రా ముకేష్ చౌదరీ యువతకు మార్గదర్శిగా నిలిచారని సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ అభివర్ణించారు. పవిత్ర రంజాన్ మాసంలో 10 ముస్లిం కుటుంబాలకు సేమియా కిట్లు పంపిణీ చేసేందుకు ఆయన ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నర్రా ముకేష్ చౌదరీ ఆర్ధిక సహకారంతో అందజేసిన కిట్లను హమీద్ షేక్ పంపిణీ చేశారు. రంజాన్ ఉపవాస దీక్షలను ముస్లిం సోదర సోదరీమణులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఆకాంక్షించారు. సేవా నిరతితో, సహృద్భావంతో పలు ముస్లిం కుటుంబాలకు తన వంతుగా సాయం అందించేందుకు ముందుకు వచ్చిన నర్రా ముకేష్ చౌదరీ ఆలోచనా సరళి ప్రశస్తమైందని అన్నారు. నర్రా ముకేష్ చౌదరీ సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచారని హమీద్ షేక్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మసూద్, సర్ధార్, జనీపాషా, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు