మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీదే విజయం – బండి సంజయ్ కుమార్

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీదే విజయం

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
చౌటుప్పల్, క్టోబర్ 25, (మనసాక్షి): మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారివిజయంతో గెలుపు సాధిస్తారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ లో బండి సంజయ్,మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి లతో కలిసి రామాలయం లో పూజలు నిర్వహించి ప్రచారం మొదలెట్టారు. చౌటుప్పల్ లోని చిన కొండూరు రోడ్డులో కమలం పువ్వు చేతపట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వికసించిన కమలం పువ్వుతో వినూత్న ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కనిపించిన ప్రతి ఓటరుకు కమలంపువ్వును చేతిలో పెట్టి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి,18 వార్డు కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్,పట్టణ బీజేపీ కార్యకర్తలు తదితరులు భారీసంఖ్యలో పాల్గొన్నారు.