హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..!

మద్యానికి బానిసై, భార్యను హత్య చేసిన కేసులో భర్తకు గౌరవనీయ ఫ్యామిలీ కోర్టు కమ్ 3వ అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి, నల్గొండ శ్రీ డి.దుర్గ ప్రసాద్ అండర్ సెక్షన్ 302 ఐపిసి ప్రకారం జీవిత ఖైదు మరియు రూ. 5000/- జరిమానా చెల్లించడంలో విఫలమైతే (06) నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..!

జిల్లా ఎస్పీ చందనా దీప్తి వెల్లడి

కొండమల్లేపల్లి , మన సాక్షి:

మద్యానికి బానిసై, భార్యను హత్య చేసిన కేసులో భర్తకు గౌరవనీయ ఫ్యామిలీ కోర్టు కమ్ 3వ అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి, నల్గొండ శ్రీ డి.దుర్గ ప్రసాద్ అండర్ సెక్షన్ 302 ఐపిసి ప్రకారం జీవిత ఖైదు మరియు రూ. 5000/- జరిమానా చెల్లించడంలో విఫలమైతే (06) నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

కొండమల్లెపల్లి మండలం హర్య తండా కి చెందిన నేనవత్ తౌర్య రెండవ కూతురు విజయను పెద్దవూర మండలం చింతపల్లి తండాకు చెందిన జఠావత్ శ్రీను కి 2009 సంవత్సరంలో వివాహం జరపగా వీరికి వివాహ జీవితం కొంత కాలం సాపిగా జరిగి ఒక కుమారుడు కలిగాడు. అనంతరం కొంత కాలం తరువాత జటావత్ శ్రీను మద్యానికి బానిసైన ఏమి పని చేయకుండా తిరుగుతూ తరుచూ గొడవ పడుతుండగా బార్య విజయ బరించలేక తన తల్లి గారి ఇంటి వద్దకు వెళ్లి జీవనం సాగిస్తున్నది.

ఈ క్రమంలో పలు మార్లు పంచాయితీ పెట్టిన శ్రీను వైఖరిలో మార్పు రాలేదు.పలితం లేకపోవడంతో విజయ తల్లిగారి ఇంటి వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నది.ఈ క్రమంలో శ్రీనుకు తన బార్య విజయ పైన కక్ష్య పెంచుకొని తేది 31-10-2021 రోజున హార్య తండాలో వ్యవసాయ క్షేత్రం వద్ద పనికి వెళ్లిన క్రమంలో విజయను భర్త శ్రీను విచక్షణ రహితంగా పదునైన ఆయుధం నరికి చంపాడు. తేది 1-11- 2021 రోజున తన తండ్రి నేనవత తౌర్య కొండమల్లెపల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితుని పైన అండర్ సెక్షన్ 302 ఐపిసి ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం సరిఅయిన ఆధారాలు కోర్టుకి సమర్పించగా నేడు విచారణ అనంతరం నిందితుడికి జీవిత ఖైదీ మరియు జరినామ విధించడం జరిగిందని తెలిపారు.

ఈ కేసులో సరిఅయిన ఆధారాలు సేకరించి కోర్టుకి అందజేసి నిందితుని శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ యై.రవీందర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ప్రస్తుత సిఐ ధనుంజయ, రామూర్తి, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఏపిపి జవహర్ లాల్, సీడీవో ఆర్.జగన్, సిహెచ్.ప్రవీణ్ కుమార్, లైసెనింగ్ ఆఫీసర్స్ హెడ్ కానిస్టేబుల్ పి.నరేందర్, పిసి ఎన్.మల్లికార్జున్ గార్లను జిల్లా ఎస్పీ అబినందిచినారు.

ALSO READ : Telangana : ఇందిరమ్మ ఇళ్ల పథకంకు వారే అర్హులు.. ఎంపిక విధానం ఇలా..!