Velugu : వెలుగు అంజయ్యది హత్యా?.. ఆత్మహత్యా?

వెలుగు అంజయ్యది హత్యా?.. ఆత్మహత్యా?

తుంగతుర్తి , మన సాక్షి

మండల కేంద్రానికి చెందిన వెలుగు అంజయ్య మరణం పై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఏపూరి సోమన్న డిమాండ్ చేశారు.

 

ఆదివారం మండల కేంద్రంలో వెలుగు అంజయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించిననతరం విలేకరులతో మాట్లాడుతూ… నెలలు గడుస్తున్న వెలుగు అంజయ్య మరణం పై పోలీసులు విచారణ చేపట్టకపోవడం బాధాకరమన్నారు.

 

ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

 

పోస్టుమార్టం రిపోర్టును తక్షణమే బయటపెట్టాలని లేనియెడల అంజయ్య కుటుంబ సభ్యులతో కలిసి మెయిన్ రోడ్డు పై దీక్ష చేస్తానని హెచ్చరించారు. ప్రశ్నించిన వారిపై నియోజకవర్గంలో దాడులు చేస్తూ అధికార పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే పాలన ఉంది తప్ప కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు.

 

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులు లబ్ది పొందారే తప్ప సామాన్య ప్రజలకు ఒరిగిందేమి లేదని అన్నారు.దళిత బంధు పథకంలో అవినీతి అక్రమాలు జరగాయని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను ఎమ్మెల్యే కిశోర్..నా కొడుకులంటూ అసభ్య పదజాలంతో దూషించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

ALSO READ : Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!

 

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదని పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఫ్యాక్షన్ రాజకీయాలను తలపించినట్లు ఉందని అన్నారు.

 

తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి వెలుగు అంజయ్య కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. వారి వెంట వైఎస్సార్టీపీ మండల అధ్యక్షులు చింతకుంట్ల పరమేష్, అంజయ్య, యాకన్న, ప్రేమ్, జక్కుల సైదులు, రామ్ తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు కోసం .. ఆ రైతులు ఇలా చేయాలి..!