బిగ్ బ్రేకింగ్ : ప్రియురాలును బండరాయితో కొట్టి చంపి.. మృతదేహాన్ని కవర్లో పెట్టిన పూజారి

బిగ్ బ్రేకింగ్ : ప్రియురాలును బండరాయితో కొట్టి చంపి.. మృతదేహాన్ని కవర్లో పెట్టిన పూజారి

సరూర్ నగర్ , మనసాక్షి :

శంషాబాద్ ప్రాంతంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. యువతిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని సరూర్నగర్ వద్దకు తీసుకువచ్చి మురికి కాలువలో పడేసిన పూజారి. ఈ సంఘటన శంషాబాద్ తో పాటు సరూర్నగర్ లో కలకలం రేపింది.

 

వివరాల ప్రకారం.. సరూర్ నగర్ కు చెందిన పూజారి వెంకట సాయి కృష్ణ అదే ప్రాంతంలో ఉంటున్న అప్సర (30) అనే యువతీతో సన్నిహిత సంబంధంతో ఉండేవాడు. అయితే సాయి కృష్ణకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

 

ALSO READ : ATM CARD | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా .. బ్యాంకు కొత్త సర్వీస్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

 

ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి అతనిపై ఒత్తిడి తీసుకువచ్చింది. దాంతో ఆమెను అడ్డు తప్పించుకోవడానికి సాయి కృష్ణ పథకం ప్రకారం ఆమెను హత్య చేశాడు

 

ఈనెల 3వ తేదీన అప్సరను సరూర్ నగర్ నుంచి కారులో ఎక్కించుకొని శంషాబాద్ కు తీసుకెళ్లాడు. నార్కడ వద్ద కు వచ్చిన తర్వాత అప్సరకు టాబ్లెట్ ఇచ్చి మత్తులోకి దించాడు.

ఆ తర్వాత ఆమెను బండరాయితో మోది హత్య చేశాడు. మృతదేహాన్ని కవర్ లో పెట్టి సరూర్ నగర్ తీసుకువచ్చి మ్యా న్ హోల్ లో పడేశాడు. మ్యాన్ హోల్ ను కాంక్రీట్ తో పూడ్చి వేశాడు.

 

ALSO READ : Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

 

ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఈనెల 5వ తేదీన శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. అప్సర స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్తానని చెప్పడంతో ఆమెను శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద డ్రాప్ చేశానని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

 

కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు సాయి కృష్ణ పై అనుమానం వచ్చి విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది.