Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
మూసి కాలువపై బ్రిడ్జి నిర్మాణం
మూసి కాలువపై బ్రిడ్జి నిర్మాణం
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి మూసి కలువా పై సుమారు రూ 40 లక్షల వ్యయంతో నిర్మించే రెండు బ్రిడ్జిల స్థలాలను మూసి అధికారులు ఆదివారం పరిశీలించారు. ఈ నెల 25 సాయంత్రం బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.
డిఈ చంద్రశేఖర్, ఏఈ స్వప్న, పరిశీలించగా వారి వెంట కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్, బిఆర్ఎస్ వార్డు అధ్యక్షులు బంగారి శ్రీనివాస్, నాయకులు రాపర్తి మహేష్ కుమార్, వల్లాల బుచ్చయ్య , తదితరులు ఉన్నారు.









